తెలంగాణ వ్యక్తికి ప్రతిష్టాత్మక అవార్డ్‌
MarinaSkies
Kizen

తెలంగాణ వ్యక్తికి ప్రతిష్టాత్మక అవార్డ్‌

29-09-2017

తెలంగాణ వ్యక్తికి ప్రతిష్టాత్మక అవార్డ్‌

తెలంగాణ వాసి నరేశ్‌ పట్వారీ ప్రతిష్టాత్మక శాంతి స్వరూప్‌ భట్నాగర్‌ పురస్కారానికి ఎంపికయ్యారు. కౌన్సిల్‌ ఆఫ్‌ సైంటిఫిక్‌ అండ్‌ ఇండస్ట్రియల్‌ రీసెర్చ్‌ (సీఎస్‌ఐఆర్‌) శాంతి స్వరూప్‌ భట్నాగర్‌ పురస్కారాన్ని ప్రకటించింది. నిజామాబాద్‌ జిల్లా బోధన్‌ వాసి అయిన నరేశ్‌ పట్వారీ ప్రస్తుతం ముంబైలో ఫ్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు. ప్రపంచ ప్రసిద్ధిగాంచిన ప్రముఖ భారతీయ శాస్త్రవేత్త శాంతి స్వరూప్‌ భట్నాగర్‌ పేరు మీదుగా ఈ పురస్కారాన్ని అందజేస్తారు. జీవ, భూమి, వాతావరణ, ఖగోళ, భౌతిక, రసాయన, సాంకేతిక, గణిత శాస్త్రాల్లో విశేష కృషి చేసిన వారికి ఈ పురస్కారం ప్రదానం చేస్తారు. శాంతి స్వరూప్‌ భట్నాగర్‌ పురస్కారం కింద రూ.5 లక్షల నగదు అందజేస్తారు. దీంతోపాటు 65వ సంవత్సరం వరకు ప్రతి నెలా రూ.15,000 అందజేస్తారు.