అక్టోబర్‌ 1న అనంతపురంకు సీఎం కేసీఆర్‌ రాక
MarinaSkies
Kizen

అక్టోబర్‌ 1న అనంతపురంకు సీఎం కేసీఆర్‌ రాక

29-09-2017

అక్టోబర్‌ 1న అనంతపురంకు సీఎం కేసీఆర్‌ రాక

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖల మంత్రి పరిటాల సునీత కుమారుడు పరిటాల శ్రీరామ్‌ వివాహానికి తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు హాజరుకానున్నారు. ఈ మేరకు జిల్లా అధికారులకు ఆయన పర్యటన షెడ్యూల్‌ అందింది. శ్రీరామ్‌ వివాహం స్వగ్రామమైన అనంతపురం జిల్లా రామగిరి మండలం వెంకటాపురంలో అక్టోబరు 1న జరగనుంది. సీఎం కేసీఆర్‌ ఆదివారం ఉదయం  11:30 గంటలకు హైదరాబాద్‌లోని బేగంపేట విమానాశ్రయం నుంచి విమానంలో బయలుదేరి మధ్యాహ్నం 12:15 గంటలకు పుట్టపర్తికి చేరుకుంటారు. అక్కడి నుంచి 12:20 గంటలకు హెలికాప్టర్‌లో బయలుదేరి 12:40 గంటలకు వెంకటాపురం చేరుకుంటారు. పెళ్లి వేడుకలో పాల్గొని 12:55 గంటలకు హెలికాప్టర్‌లో పుట్టపర్తికి, మధ్యాహ్నం 1.:20 గంటలకు పుట్టపర్తి నుంచి విమానంలో 2:10 గంటలకు హైదరాబాద్‌కు చేరుకుంటారు.