తెలంగాణలో మలేసియా పెట్టుబడులు
APEDB

తెలంగాణలో మలేసియా పెట్టుబడులు

29-09-2017

తెలంగాణలో మలేసియా పెట్టుబడులు

తెలంగాణలో మలేసియా దేశం తరపున పెద్దఎత్తున పెట్టుబడులు పెట్టాలని ఉపముఖ్యమంత్రి మహమూద్‌ అలీ కోరారు. మలేసియాలోని సెలెంగర్‌ రాష్ట్ర ముఖ్యమంత్రి మహ్మద్‌ అజ్మీన్‌ బిన్‌ అలీ తమ ప్రతినిధి బృందంతో కలిసి తెలంగాణ పర్యటనకు వచ్చారు. ఉపముఖ్యమంత్రి మహమూద్‌ అలీతో సమావేశమయ్యారు. పరిశ్రమల శాఖ ముఖ్యకార్యదర్శి జయేశ్‌ రంజన్‌ తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. తెలంగాణలో అత్యుత్తమ పారిశ్రామిక విధానం అమల్లో ఉందని, దేశవిదేశాల నుంచి అనేక పరిశ్రమలు ఇక్కడికి వచ్చి పెట్టుబడులు పెడుతున్నాయని తెలిపారు. తెలంగాణ అభివృద్ధికి సహకరిస్తామని ఈ సందర్భంగా సెలెంగర్‌ సీఎం హామీ ఇచ్చారు.