అందరిని కలపడమే అలయ్ బలయ్
MarinaSkies
Kizen

అందరిని కలపడమే అలయ్ బలయ్

28-09-2017

అందరిని కలపడమే అలయ్ బలయ్

అక్టోబర్‌ 1న అలయ్‌ బలయ్‌ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు కేంద్ర మాజీ మంత్రి బండారు దత్త్తాత్రేయ అన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ కార్యక్రమానికి తెలుగు రాష్ట్రాల గవర్నర్‌ నరసింహన్‌, కేంద్ర కార్మిక శాఖ మంత్రి సంతోష్‌కుమార్‌ ముఖ్య అతిథులుగా హాజరవుతారని తెలిపారు. నాంపల్లి ఎగ్జిబిషన్‌ గ్రౌండ్‌లో అలయ్‌ బలయ్‌ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మనుషులంతా ఐక్యంగా ఉండాలనే సంకల్పంతోనే ఈ కార్యక్రమాన్ని గత కొన్నేళ్లుగా నిర్వహిస్తున్నట్లు చెప్పారు. అలయ్‌ బలయ్‌లో తెలంగాణ వంటకాలు, సంస్కృతులు ప్రతిబింబిస్తాయన్నారు. రాజకీయ విబేధాలున్నా మనుషులుగా అందరూ ఒక్కటిగా ఉండాలన్నారు. ఇకపై తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అలయ్‌ బలయ్‌ నిర్వహిస్తామని పేర్కొన్నారు.