హైదరాబాద్‌లో మరో అంతర్జాతీయ సంస్థ
Sailaja Reddy Alluddu

హైదరాబాద్‌లో మరో అంతర్జాతీయ సంస్థ

01-04-2017

హైదరాబాద్‌లో మరో అంతర్జాతీయ సంస్థ

హైదరాబాద్‌ నగరానికి మరో అంతర్జాతీయ సంస్థ మంజూరైంది. కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిత్వశాఖ, ఆసియా-పసిఫిక్‌ సమీకృత గ్రామీణాభివృద్ధి కేంద్రం(సీఐఆర్‌డీఏపి) భాగస్వామ్యంతో హైదరాబాద్‌లోని జాతీయ గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆవరణలో సీఐఆర్‌డీఏపీ పరిశోధన కేంద్రం ఏర్పాటుకు కేంద్ర క్యాబినేట్‌ ఆమోదం తెలిపింది. ఢిల్లీలో ప్రధాని నరేంద్రమోడీ అధ్యక్షతన జరిగిన కేంద్ర క్యాబినేట్‌ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు.