ఓయూ శతాబ్ది ఉత్సవాలకు రాష్ట్రపతి

ఓయూ శతాబ్ది ఉత్సవాలకు రాష్ట్రపతి

31-03-2017

ఓయూ శతాబ్ది ఉత్సవాలకు రాష్ట్రపతి

ఓయూ శతాబ్ధి ఉత్సవాలకు రాష్ట్రపతి పర్యటన ఖరారైంది. రాష్ట్రపతి చేతుల మీదుగా ఉత్సవాలను ప్రారంభించేందుకు తెలంగాణ సర్కార్‌ ఇప్పటికే రాష్ట్రపతిని కలిసి ఆహ్వానించిన విషయం విధితమే. ఇందులో భాగంగా ఏప్రిల్‌ 26న రాష్ట్రపతి ప్రణబ్‌ ఓయూ శతాబ్ది ఉత్సవాలను ప్రారంభిస్తారని డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి తెలిపారు. 27న ఉత్సవాల్లో మహారాష్ట్ర గవర్నర్‌ విద్యాసాగర్‌రావు పాల్గొంటారని చెప్పారు. 28న వీసీల కాన్ఫరెన్స్‌ను కేంద్రమంత్రి ప్రకాశ్‌ జవదేవకర్‌ ప్రారంభిస్తారని, ఉన్నత స్థానాల్లో ఉన్న వంద మంది పూర్వ విద్యార్థులకు సన్మానం చేస్తామని ఆయన పేర్కొన్నారు. ఉత్సవాలకు నిజాం కుటుంబసభ్యులను ఆహ్వానిస్తామని, డాక్టరేట్ల ప్రదానం అంశాన్ని పరిశీలిస్తున్నామని ఆయన వివరించారు. శిథిలావస్థలో ఉన్న హాస్టళ్ల స్థానంలో కొత్త హాస్టళ్లలకు, అకాడమిక్‌ బ్లాక్‌లు, శతాబ్ది భవనానికి అదే రోజు శంకుస్థాపన చేస్తామని తెలిపారు. వచ్చే ఏడాది జనవరి 3 నుంచి జరిగే ఇండియన్‌ కాంగ్రెస్‌కు ప్రధాని మోడీ వస్తారని తెలిపారు.