మీకు హిమాన్స్‌ మాకు దేవాన్ష్‌

మీకు హిమాన్స్‌ మాకు దేవాన్ష్‌

28-03-2017

మీకు హిమాన్స్‌ మాకు దేవాన్ష్‌

తెలంగాణ శాసనసభ నుంచి సస్పెన్షన్‌కు గురైన తెలుగుదేశం పార్టీ ఫైర్‌ బ్రాండ్‌ అనుముల రేవంత్‌రెడ్డి సోమవారం ఉదయం అసెంబ్లీకి రాగా ఆయనను ఎవరూ అడ్డుకోలేదు. లాబీల్లోకి వెళ్లిన రేవంత్‌కు, టీఆర్‌ఎస్‌ ఎంపీ బాల్క సుమన్‌ ఎదురుపడగా వారిద్దరి మధ్యా ఆసక్తికర సరదా సంభాషణ చోటు చేసుకుంది. సస్పెన్షన్‌ అమలులో ఉండగా, ఎలా లోపలికి రానిచ్చారని సుమన్‌ ప్రశ్నించగా హిమాన్ష్‌ చెప్పడం వల్ల తనను రానిచ్చారని రేవంత్‌ సరదా వాఖ్యలు చేశారు. నన్వు రానివ్వాలని హిమాన్ష్‌ వాళ్ల తాతకు (కేసీఆర్‌)కు చెప్పాడు. కాబట్టే ఇక్కడి దాకా అనుమతించారు. మీలాంటి స్నేహితులకన్నా హిమాన్ష్‌ బెటర్‌ అని వ్యాఖ్యానించారు. ఇందుకు ప్రతిస్పందించిన బాల్క సుమన్‌ అలాగా మీకు హిమాన్స్‌ ఉంటే  మాకు దేవాన్ష్‌ ఉన్నాడు అని చెప్పడంతో అక్కడున్న వారిలో నవ్వు అగలేదు. ఆపై పార్లమెంటు సమావేశాలు జరుగుతుంటే ఎందుకు వెళ్లలేదని బాల్క సుమన్‌ను రేవంత్‌ ప్రశ్నించారు. పార్టీ పనులలో బిజీగా  ఉండటంతోనే తాను వెళ్లలేదని చెప్పిన సుమన్‌ అక్కడి నుంచి వెళ్లిపోయారు.