ప్రపంచంలో అత్యధిక అప్పులు అమెరికాకే

ప్రపంచంలో అత్యధిక అప్పులు అమెరికాకే

28-03-2017

ప్రపంచంలో అత్యధిక అప్పులు అమెరికాకే

తమ ప్రభుత్వం అప్పులు చేస్తోందంటూ ప్రతిపక్ష సభ్యులు విమర్శలు చేస్తున్నారని, ఆ విమర్శలు సరికావని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ అన్నారు. శాసనసభలో ద్రవ్య వినిమయ బిల్లుపై  మాట్లాడుతూ ఎకనామిక్ల్సో ట్రెండ్స్‌ మారిపోయాయని, ప్రపంచం  ఎటు వెళుతుందో మనమూ అటు వైపే వెళ్లాలని అన్నారు. ప్రపంచంలో అత్యధిక ధనిక దేశం అమెరికా అని అత్యధిక అప్పులు కూడా ఆ దేశానికే ఉన్నాయని అన్నారు. వారు మనకన్నా తెలివిఎక్కువ వారే కానీ, తెలివి తక్కువ వారు కాదు అని అన్నారు. అప్పులు తెచ్చుకునే వీలు ఉంటే తెచ్చుకోవచ్చని అన్నారు. అప్పులు తెచ్చి వాటిని ఖర్చు పెట్టకపోతే తప్పవతుందని అన్నారు. అప్పులు తీసుకోవడమే కాదు మళ్లీ తిరిగి తీరుస్తూనే ఉంటామని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అప్పులు తిరిగి చెల్లిస్తూనే ఉందని చెప్పారు.