నాసా సదస్సుకు ఎంపికయిన ట్రిపుల్‌ ఐటీ విద్యార్థులు

నాసా సదస్సుకు ఎంపికయిన ట్రిపుల్‌ ఐటీ విద్యార్థులు

28-03-2017

నాసా సదస్సుకు ఎంపికయిన ట్రిపుల్‌ ఐటీ విద్యార్థులు

నిర్మల్‌ జిల్లా బాసర ట్రిపుల్‌ఐటీ కళాశాల విద్యార్థులు అంతర్జాతీయస్థాయిలో ప్రతిభ చాటారు. కళాశాల నుంచి రెండు ప్రయోగాలు అమెరికాలోని నాసాకు ఎంపికయ్యాయి. ప్రపంచంలోని 30 దేశాల నుంచి 1,500 ప్రయోగాలు నాసా సదస్సుకు పంపగా ట్రిపుల్‌ ఐటీ నుంచే రెండు ప్రయోగాలు ఎంపికయ్యాయి. వీటిలో విహాన్‌ ప్రయోగం రెండో బహుమతిగా పొందగా, గౌరవ బహుమతిగా విహాజానీ ప్రయోగానికి దక్కింది. మే 25న అమెరికాలో జరిగే నాసా సదస్సులో విద్యార్థులు ప్రాజెక్టుల గురించి వివరించనున్నారు. నాసా సదస్సుకు ఎంపికైన విద్యార్థులను వీసీ సత్యనారాయణ అభినందించారు.