టిహబ్‌ స్టార్టప్‌లకు అంతర్జాతీయ గుర్తింపు

టిహబ్‌ స్టార్టప్‌లకు అంతర్జాతీయ గుర్తింపు

27-03-2017

టిహబ్‌ స్టార్టప్‌లకు అంతర్జాతీయ గుర్తింపు

హైదరాబాద్‌లో ఉన్న టీహబ్‌లోని స్టార్టప్‌ యూనిట్లకు ఇప్పుడు ప్రపంచ స్థాయి గుర్తింపు లభించింది. దేశంలోనే స్టార్టప్‌ డేటాబేస్‌కు అతిపెద్ద హబ్‌గా నిలిచిన టిహబ్‌ పరిధిలోని నాలుగు స్టార్టప్‌ యూనిట్లకు ప్రతిష్టాత్మక అవార్డులు లభించాయి. రెండువేల స్టార్టప్‌లకుపైగా ఉన్న టిహబ్‌లో హగ్‌ ఇన్నొవేషన్స్‌, లూప్‌ రియాల్టీ, ఔత్‌బేస్‌, ఖేతీ స్టార్టప్‌లకు అంతర్జాతీయ గుర్తింపు లభించింది. హగ్‌ ఇన్నొవేషన్స్‌ ఎగిరే డ్రోన్లను నియంత్రించే హగ్‌ స్మార్ట్‌వాచ్‌ పరిజ్ఞానాన్ని రూపొందించింది. స్మార్ట్‌ టెలివిజన్లు ఇతర ఆధునిక ఐటి ఉత్పత్తులకు అనుగుణంగా సాంకేతిక పరిజ్ఞానం అందించింది. మొత్తం మొబైల్‌ వరల్డ్‌ కాంగ్రెస్‌లో 1500కు పైగా స్టార్టప్‌ కంపెనీలు పాల్గొన్నాయి. ఆసియా పసిఫిక్‌ ప్రాంతం  నుంచి టాప్‌ మూడు సంస్థల్లోనూ, బార్సిలోనా షోలో టాప్‌టెన్‌లోనూ టిహబ్‌ స్టార్టప్‌లు నిలిచాయి. హగ్‌ ఇన్నొవేషన్స్‌ షెంజెన్‌ ఇన్నొవేషన్‌ ఎంటర్‌ప్రైన్యూర్‌ అవార్డు గెలుచుకుంది. పలూప్‌రియాల్టీ కూడా రెండో  రన్నర్‌ ఆప్‌ స్థానాన్ని గెలుచుకుంది. ఈ రెండు సంస్థలు వచ్చే ఏప్రిల్‌ 11-18 వరకూ చైనాలో జరిగే ఫైనల్స్‌కు హాజరవుతాయి.

ఇక సైబర్‌ సెక్యూరిటీపరంగా ఔత్‌బేస్‌ స్టార్టప్‌కు రేసుటుగ్రేస్‌ 2017 అవార్డు లభించింది.  క్లౌడ్‌, డేటా అనలిటిక్స్‌ హెల్త్‌కేర్‌, విద్య సోషల్‌ మీడియా, ఇ-కామర్స్‌, ఐఒటి, బిఎఫ్‌ఎస్‌ఐ రంగాలకు సంబంధించిన స్టార్టప్‌లకే ఎక్కువ దక్కాయి. టిహబ్‌ సిఇఓ జైకృష్ణన్‌ మాట్లాడుతూ ప్రపంచంలోనే అత్యుత్తమ తీరును ప్రతిభానైపుణ్యాలను భారతీయ స్టార్టప్‌ సంస్థలు చూపిస్తాయని, స్టార్టప్‌ వాతావరణం ప్రపంచంలోకెల్లా అగ్రగామి వంటిదని అన్నారు. తెలంగాణ ప్రభుత్వం ట్రిపుల్‌ ఐటి, ఐఎస్‌బి నల్సార్‌ సంస్థల భాగస్వామ్యంతో పిపిపి పద్దతిలో టిహబ్‌ పనిచేస్తున్న సంగతి తెలిసిందే.