ఉస్మానియాలో 105వ సైన్స్‌ కాంగ్రెస్‌

ఉస్మానియాలో 105వ సైన్స్‌ కాంగ్రెస్‌

27-03-2017

ఉస్మానియాలో 105వ సైన్స్‌ కాంగ్రెస్‌

వచ్చే సంవత్సరం జరిగే సైన్స్‌ కాంగ్రెస్‌ హైదరాబాద్‌లోని ఉస్మానియా యూనివర్సిటీలో జనవరి 3 నుంచి ఐదు రోజుల పాటు జరగనుందని ఇండియన్‌ సైన్స్‌ కాంగ్రెస్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు ప్రొఫెసర్‌ అచ్యుత సమంత వెల్లడించారు. హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడిన ఆయన, ఐఎస్‌సీఏ పూర్వ అధ్యక్షుడు అశోక్‌ సక్సేనా అధ్యక్షతన ఓ కమిటీని నెలకొల్పామని, ఐదు ప్రముఖ యూనివర్సిటీలు ఈ సెషన్‌కు ఆతిథ్యమివ్వనున్నాయని తెలిపారు. అన్ని అంశాలనూ పరిశీలించిన మీదట ఉస్మానియా పేరును సిఫార్సు చేసినట్లు వెల్లడించారు. ఉస్మానియా శతాబ్ది ఉత్సవాల వేళ ఈ కార్యక్రమం జరగడం ఎంతో ఆనందాన్ని కలిగిస్తోందని, తన అభ్యర్థనకు ఉస్మానియా అంగీకరించిందని పేర్కొన్నారు.