అమెరికా వ్యాపార సదస్సుకు తెలంగాణ ప్రొఫెసర్‌

అమెరికా వ్యాపార సదస్సుకు తెలంగాణ ప్రొఫెసర్‌

25-03-2017

అమెరికా వ్యాపార సదస్సుకు తెలంగాణ ప్రొఫెసర్‌

టెక్నాలజీ బిజినెస్‌ ఇన్‌క్యూబేటర్‌ (టిబిఐ) కోఆర్డినేటర్‌ మరియు యూనివర్సిటీ ఆఫ్‌ హైదరాబాద్‌ (యూఒహెచ్‌) స్కూల్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌ స్టడీస్‌లో పనిచేస్తున్న ప్రొఫెసర్‌ వి.వెంకట రమణకు గ్రేటర్‌ అట్లాంటా తెలంగాణ సొసైటీ (జిఎజిఇఎస్‌) ఆధ్వర్యంలో  మార్చి 26న  నైటెడ్‌ అమెరికాలో జరిగే వ్యాపార సదస్సులో ముఖ్య నిర్వాహకునిగా పాల్గొనవలసింది ఆహ్వానం అందింది. భారతదేశం, తెలంగాణలో వ్యాపార అవకాశాలు, విధానాలు అనే అంశంపై ఈ వ్యాపార సదస్సులో చర్చిస్తారు. గ్రేటర్‌ అట్లాంటా తెలంగాణ సొసైటీ, అట్లాంటాలోని కాన్సులేట్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా సంయుక్త ఆధ్వర్యంలో ఈ సదస్సును నిర్వహిస్తున్నారు. భారతదేశం ప్రత్యేకించి తెలంగాణ రాష్ట్రం, అట్లాంటా వ్యాపారవేత్తల మధ్య వ్యాపార సంబంధాలను మరింత బలోపేతం చేసేందుకు ఒక వారధిగా ఉండడమే ఈ సదస్సు లక్ష్యం.