పారిశ్రామికాభివృద్ధిలో తెలంగాణనే ముందు

పారిశ్రామికాభివృద్ధిలో తెలంగాణనే ముందు

22-03-2017

పారిశ్రామికాభివృద్ధిలో తెలంగాణనే ముందు

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన పారిశ్రామిక విధానం ఇండస్ట్రియల్‌ రంగంలో విప్లవాత్మక మార్పులను తీసుకువచ్చింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో తిరోగమనంలో ఉన్న పారిశ్రామిక ప్రగతి ఇప్పుడు పురోగమన బాటపట్టింది. అవినీతికి ఆస్కారం లేకుండా సింగిల్‌ విండో విధానంలో అనుమతులు, పారదర్శక విధానంతో రాష్ట్రం పారిశ్రామిక రంగంలో ఊహించని వృద్ధి రేటును సాధించింది. ఇదే విషయాన్ని రాష్ట్రంలో కీలకమైన పారిశ్రామిక రంగ సంస్థ ఫెడరేషన్‌ ఆఫ్‌ తెలంగాణ అండ్‌ ఆంధ్రప్రదేశ్‌ చాంబర్స్‌ ఆఫ్‌ కామర్స్‌ అండ్‌ ఇండస్ట్రీ ఎఫ్‌ట్యాప్పీ వెల్లడించింది.