ఈ నెల 23నుంచి ఐఐపీ జాతీయ సదస్సు

ఈ నెల 23నుంచి ఐఐపీ జాతీయ సదస్సు

21-03-2017

ఈ నెల 23నుంచి ఐఐపీ జాతీయ సదస్సు

ప్యాకేజింగ్‌ రంగంలో వస్తున్న మార్పులు, సాంకేతికత, అభివృద్ధికి ఉన్న అవకాశాలపై రెండు రోజుల అంతర్జాతీయ సదస్సు హైదరాబాద్‌లోని ఐటీసీ కాకతీయ హోటల్‌లో ఈ నెల 23, 24వ తేదీల్లో జరగనుంది. కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ ఆధ్వర్యంలో స్వతంత్ర హోదాతో పనిచేసే ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ప్యాకేజింగ్‌ (ఐఐపీ) దీన్ని నిర్వహించనుంది. ఇన్నో విజన్‌ ఇన్‌ ప్యాకేజింగ్‌ పేరుతో జరిగే ఈ సదస్సుకు మన దేశం తోపాటు అమెరికా, బ్రిటన్‌, జర్మనీ, స్విట్జర్లాండ్‌, ఆస్ట్రియా తదితర దేశాల నుంచి దాదాపు 300 మందికిపైగా ప్రతినిధులు హాజరు కానున్నారు.  దీనికి వరల్డ్‌ ప్యాకేజింగ్‌ ఆర్గనైజేషన్‌, ది ఏషియన్‌ ప్యాకేజింగ్‌ ఫెడరేషన్‌లు సహకారం అందిస్తున్నట్లు ఐఐపీ హైదరాబాద్‌ జాయింట్‌ డైరెక్టర్‌ మాధవ్‌ చక్రవర్తి తెలిపారు. రెండేళ్లలో మరో మూడు చోట్ల ఐఐపీలను ఏర్పాటు చేస్తామని, అందులో ఒకటి కాకినాడలో ఉంటుందని తెలిపారు. సెన్సర్లతో కూడిన ఎలక్ట్రానిక్‌ నాలుక వల్ల ప్యాకేజీలలో ఉన్న ఆహార పదార్థాలు పాడైతే వెంటనే ఆ ప్యాకేజీ రంగు మారుతుందని ఐఐపీ గవర్నింగ్‌ బాడీ సభ్యుడు ఏవీపీఎస్‌ చక్రవర్తి తెలిపారు.