బీజేపీ నుంచే బాహుబలి వస్తారు

బీజేపీ నుంచే బాహుబలి వస్తారు

21-03-2017

బీజేపీ నుంచే బాహుబలి వస్తారు

తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ నుంచి బాహుబలి వస్తారని బీజేపీ శాసనసభాపక్ష నేత కిషన్‌రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియా మాట్లాడుతూ తెలంగాణలో మతపరమైన రాజకీయాలకు స్వస్తి పలకాలని ప్రభుత్వాన్ని కోరారు. విద్య, ఉద్యోగాల్లో ముస్లింలకు రిజర్వేషన్లు తీసుకొస్తామనడం సరికాదన్నారు. ముస్లింలకు 12శాతం రిజర్వేషన్‌కు ఆమోదముద్ర వేస్తారని వార్తలు వస్తున్నాయని ఈ నిర్ణయం సరికాదన్నారు. వైఎస్‌ అధికారంలో ఉన్నప్పుడు తీసుకున్న 4శాతం రిజర్వేషన్‌ నిర్ణయాన్ని కూడా వెనక్కి తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. ముస్లిం రిజర్వేషన్‌పై రాష్ట్రంతో జాతీయస్థాయిలో బీజేపీ పోరాటం చేస్తుందని సృష్టం చేశారు. తెలంగాణ అభివృద్ధి కోసం మోడీ కృషి చేస్తున్నారని తెలిపారు.