ఇది నిజాం కాలం కాదు

ఇది నిజాం కాలం కాదు

17-03-2017

ఇది నిజాం కాలం కాదు

ఉద్యమాలకు వూపిరి పోసిన ధర్నాచౌక్‌ను తరలించాలనుకోవడం సరియైందని కాదని బీజేపీ ఎమ్మెల్యే జి.కిషన్‌ రెడ్డి విమర్శించారు. మూడేళ్ల టీఆర్‌ఎస్‌ పాలనలో ప్రభుత్వంపై వ్యతిరేకత పెరుగుతోందని, ప్రజలు తిరడబడితే సర్కారుకు ముప్పు వాటిల్లు తుందనే ఈ నిర్ణయం తీసుకున్నారని ఆరోపించారు. ధర్నా చౌక్‌ను ఎత్తివేయాలనే ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఇందిరా పార్క్‌ నుంచి అసెంబ్లీ వరకు బీజేపీ ఎమ్మెల్యేలు పాదయాత్ర నిర్వహించారు. ఈ సందర్బంగా కిషన్‌ రెడ్డి మాట్లాడుతూ ప్రజా, కుల, ఉద్యోగ, విద్యార్థి, రాజకీయ సంఘాల హక్కులను హరించడం తగదన్నారు. బేషజాలకు పోకుండా ధర్నాచౌక్‌పై ఆంక్షలు ఎత్తివేయాలని డిమాండ్‌ చేశారు. ప్రజలు తమ కష్టాలు ప్రభుత్వానికి చెప్పుకునే అవకాశం రాజ్యాంగం ద్వారా అంబేడ్కర్‌ కల్పించారని అన్నారు. ప్రజలంతా తమ కష్టాలు చెప్పుకునే వేదికను తరలిస్తామనడం మంచిది కాదన్నారు. ఇది నిజాం కాలం కాదని, నియంతృత్వ పోకడలు ఇప్పుడు కుదరవని హెచ్చరించారు.