ఆధ్యాత్మిక కేంద్రంగా యాదాద్రి : కేటీఆర్‌

ఆధ్యాత్మిక కేంద్రంగా యాదాద్రి : కేటీఆర్‌

17-03-2017

ఆధ్యాత్మిక కేంద్రంగా యాదాద్రి : కేటీఆర్‌

ఆధ్యాత్మిక కేంద్రంగా తెలంగాణకు యాదాద్రిని తీర్చిదిద్దుతామని మంత్రి కేటీఆర్‌ అన్నారు. శాసనసభలో కేటీఆర్‌ మాట్లాడుతూ ఆలయ అభివృద్ధి పనులు శరవేగంగా జరుగుతున్నాయని తెలిపారు. వైటీడీఏ పరిధిలోకి యాదాద్రి చుట్టు ప్రక్కల గ్రామాలను తీసుకుంటామన్నారు. టెంపుల్‌ సిటీ అభివృద్ధికి 250 ఎకరాలు కేటాయించామని చెప్పారు. భక్తులకు ఇబ్బందులు లేకుండా కాటేజ్‌లు, పార్కింగ్‌ సదుపాయం కల్పిస్తామన్నారు. 5వేల మంది భక్తులకు నిత్యాన్నదానం చేసేందుకు వీలుగా భోజనశాల నిర్మాణం కొనసాగుతుందన్నారు. యాదాద్రాని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతామని ప్రకటించారు. భక్తులకు ఏసీ గదులు, విశ్రాంతి గదులతో పాటు ఇతర సౌకర్యాలు కల్పించే విధంగా నిర్మాణ పనులు కొనసాగుతున్నాయని చెప్పారు. కాటేజీల నిర్మాణానికి ముందుకొస్తున్న దాదల వివరాలను ప్రభుత్వం దృష్టికి తీసుకువస్తే వెసులుబాటు కల్పిస్తామన్నారు.