ఓయూకు మరో అరుదైన అవకాశం
MarinaSkies
Kizen

ఓయూకు మరో అరుదైన అవకాశం

16-03-2017

ఓయూకు మరో అరుదైన అవకాశం

శతాబ్ది ఉత్సవాలకు సిద్ధమవుతున్న ఉస్మానియా యూనివర్సిటీకి మరో అరుదైన అవకాశం లభించింది. వచ్చే ఏడాది జనవరి 3 నుంచి 7 వరకు జరుగనున్న 105వ ఇండియన్‌ సైన్స్‌ కాంగ్రెస్‌కు ఓయూ ఆతిథ్యం ఇవ్వనుంది. ఈ మేరకు ఇండియన్‌ సైన్స్‌ కాంగ్రెస్‌ అసోసియేషన్‌ జనరల్‌ ప్రెసిడెంట్‌ డాక్టర్‌ అచ్యుత సమంత నుంచి ఓయూ వైస్‌ చాన్స్‌లర్‌ ప్రొఫెసర్‌ ఎస్‌ రామచంద్రానికి సమాచారం అందింది. ఈ ప్రతిష్ఠాత్మకమైన అవకాశాన్ని ఇచ్చినందుకు వీసీ రామచంద్రం సైన్స్‌ కాంగ్రెస్‌ అసోసియేషన్‌కు కృతజ్ఞతలు తెలిపారు. 1998లో జరిగిన 85 ఇండియన్‌ సైన్స్‌ కాంగ్రెస్‌కు ఓయూ ఆతిథ్యం ఇచ్చింది.