గెలవలేమనే భయంతోనే ముందస్తు

గెలవలేమనే భయంతోనే ముందస్తు

12-09-2018

గెలవలేమనే భయంతోనే ముందస్తు

2019లో గెలవలేమనే భయంతోనే టీఆర్‌ఎస్‌ ముందస్తు ఎన్నికలకు వెళ్తోందని కాంగ్రెస్‌ నేత, మాజీ ఉపముఖ్యమంత్రి దామోదర రాజనరసింహ విమర్శించారు. ముందస్తు ఎన్నికలు అవసరమా? అని ప్రజలు ప్రశ్నిస్తున్నారని అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ప్రజల విశ్వాసం కోల్పోయిందన్నారు. నాలుగేళ్లలో 2 లక్షల కోట్ల అప్పుచేసిన ఘనత టీఆర్‌ఎస్‌ ప్రభుత్వానిదేనని అన్నారు. ప్రతి ప్రాజెక్టులోనూ పర్సంటేజీలు తీసుకున్నారని ఆరోపించారు.