ఎంఐఎం అభ్యర్థుల మొదటి జాబితా విడుదల

ఎంఐఎం అభ్యర్థుల మొదటి జాబితా విడుదల

11-09-2018

ఎంఐఎం అభ్యర్థుల మొదటి జాబితా విడుదల

అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో తమకు పట్టున్న స్థానాల్లో మళ్లీ భారీ ఆధిక్యంతో పాగా వేసేందుకు ఆల్‌ ఇండియా మజ్లిస్‌ ఇతే హదుల్‌ ముస్లిమీన్‌ (ఏఐఎంఐఎం) పార్టీ సన్నాహాలు చేస్తోంది. ఇందుకు అనుగుణంగా కార్యాచరణను రూపొందించి అభ్యర్థులతో పాటు పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేస్తోంది. తాజాగా గ్రేటర్‌ హైదరాబాద్‌లోని ఏడు స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. చంద్రాయణగుట్ట- అక్బరుద్దీన్‌ ఓవైసీ, యాకుత్‌పుర- సయ్యద్‌ అహ్మద్‌ పాషాఖాద్రీ, చార్మినార్‌ - ముంతాజ్‌ అహ్మద్‌ఖాన్‌, బహదూర్‌పుర- మహ్మద్‌ మొజంఖాన్‌, మలక్‌పేట-అహ్మద్‌బిన్‌ అబ్దుల్లా బలాల, నాంపల్లి- జాఫర్‌ హుస్సేన్‌ మేరాజ్‌, కార్వాన్‌ - కౌసర్‌ మొహిద్దీన్‌లకు టికెట్లు ఖరారు చేశారు.