మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి అరెస్ట్

మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి అరెస్ట్

11-09-2018

మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి అరెస్ట్

మాజీ శాసనసభ్యుడు, కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నాయకుడు జగ్గారెడ్డిని పటాన్‌చెరులో పోలీసులు అరెస్టు చేశారు. జగ్గారెడ్డి నకిలీపత్రాలతో పాస్‌పోర్టు తీసుకున్నట్లు పోలీసులు గుర్తించారు. 2004లో తప్పుడు పత్రాలతో వీసా పొంది కుటుంబసభ్యులతో పాటు నెల రోజుల అమెరికాలో గడిపి వచ్చినట్లు గుర్తించారు. నార్త్‌జోన్‌ పోలీసులకు అందిన సమాచారం మేరకు జగ్గారెడ్డిని అరెస్టు చేసి విచారణ జరుపుతున్నారు. జగ్గారెడ్డి అరెస్టును పీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తీవ్రంగా ఖండించారు. నగర పోలీసు కమిషనర్‌ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఏజెంటులా వ్యవహరిస్తున్నారని అన్నారు. పాస్‌పోర్టులకు సంబంధించిన టిఆర్‌ఎస్‌ నాయకులపై కూడా కేసులున్నాయని, హరీష్‌రావును ఇతరులను అరెస్టు చేస్తారా అని ప్రశ్నించారు. జగ్గారెడ్డికి ఏదైనా జరిగితే అందుకు పోలీసులే బాధ్యత వహించాలని, ఇలాంటి అరెస్టులతో కాంగ్రెస్‌ నేతలను ఎన్నికల్లో పాల్గొనకుండా ఆపలేరని పేర్కొన్నారు.