జంట పేలుళ్ళ కేసులో నిందితులకు శిక్ష ఖరారు

జంట పేలుళ్ళ కేసులో నిందితులకు శిక్ష ఖరారు

11-09-2018

జంట పేలుళ్ళ కేసులో నిందితులకు శిక్ష ఖరారు

దేశ వ్యాప్తంగా సంచలనం రేపిన లుంబినీ పార్క్‌, గోకుల్‌చాట్‌ జంట పేలుళ్ల కేసులో దోషులుగా తేలిన ఇద్దరు ఉగ్రవాదుకు ఉరిశిక్ష విధిస్తూ జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఎ) ప్రత్యేక కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ఇదే సమయంలో ఈ పేలుళ్ల కేసుకు సంబంధించి నిందితులకు ఆశ్రయం ఇచ్చిన మరో ఉగ్రవాదికి ఎన్‌ఐఎ కోర్టు యావజ్జీవ కారాగార శిక్షను విధించింది. చర్లపల్లి జైలు వద్ద నాటకీయ పక్కీలో జరిగిన పరిణామాలు తీవ్ర ఉత్కంఠకు దారితీయగా చివరకు ఈ కేసులో దోషులుగా తేలిన ఇద్దరు ఉగ్రవాదులకు పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ కోరినట్లుగా ఉరిశిక్ష విధించడంతో పాటు మరో ఉగ్రవాదికి జీవితఖైదు శిక్షను విధించడంతో 11 ఏళ్ల సుదీర్ఘ కాలం సాగిన జంటపేలుళ్ల కేసు విచారణ ఓ కొలిక్కిరాగా పేలుళ్ల కేసులో బాధితుల కుటుంబాలు సంతోషం వ్యక్తం చేశాయి. కాగా ఇదే కేసులో పరారిలో వున్న ముగ్గురి నిందితులపై విచారణ కొనసాగుతుందని కోర్టు చెప్పడం గమనార్హం.