దానం నాగేందర్ కు గోషామహల్!

దానం నాగేందర్ కు గోషామహల్!

11-09-2018

దానం నాగేందర్ కు గోషామహల్!

సీనియర్‌ రాజకీయ నాయకుడు దానం నాగేందర్‌కు టీఆర్‌ఎస్‌ పార్టీ గోషామహాల్‌ టికెట్‌ను ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఖరారు చేశారు. ఈ నెల 13న ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించనున్నట్లు సమాచారం. కాగా దానం నాగేందర్‌ టీఆర్‌ఎస్‌ అగ్రనాయకత్వం తీరుపట్ల అసంతృప్తితో ఉన్నారనీ, ఈ నెల 6వ తేదీన టీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రకటించిన 105 అభ్యర్థుల జాబితాలో తన పేరు లేకపోవడంపై ఆయన ఆవేదన చెందుతున్నారని జోరుగా ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో తాను ఒక హోటల్‌లో టీ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌ కుమార్‌రెడ్డిని కలిసినట్లు త్వరలో కాంగ్రెస్‌లో చేరబోతున్నట్లు సామాజిక మాధ్యమాల్లో అసత్య ప్రచారం చేస్తోందని దానం నాగేందర్‌ మండిపడ్డారు.