మెడికల్ టూరిజం హబ్ గా హైదరాబాద్

మెడికల్ టూరిజం హబ్ గా హైదరాబాద్

14-03-2017

మెడికల్  టూరిజం హబ్ గా హైదరాబాద్

ప్రపంచ ప్రఖ్యాత ఐటీ కంపెనీలతో ఐటీ రంగంలో. ఫార్మా రంగంలోనూ వస్తున్న పెట్టుబడులతో హైదరాబాద్‌ నగరం పురోగమిస్తోంది. భద్రతానగరంగా మన్ననలు పొందుతోంది. ఇప్పుడు మెడికల్‌ టూరిజంలోనూ తనదైన ప్రత్యేకతను చాటుకుంటోంది. విదేశాల్లోనూ సాధ్యం కాని సర్జరీలు చేస్తూ నగర వైద్యులు అందరి మన్నన్నలు పొందుతున్నారు. దాదాపు ఇరవై ఐదు దేశాల నుంచి రోగులు వైద్యం కోసం వస్తున్నారు. ప్రతి ఏటా నగరానికి వస్తున్న మెడికల్‌  టూరిస్ట్‌లు 20 నుంచి 30 శాతం పెరుగుతున్నారు.

ప్రపంచం ఇప్పుడు ఇండియా వైపు చూస్తోంది. అందులోనూ  హైదరాబాద్‌ వైపు. అంతర్జాతీయస్థాయి ప్రమాణాలతో పాటు అత్యాధునిక వైద్య పరికరాలు, నిష్టాతులైన వైద్యులు అందుబాటులో ఉండడమే అందుకు కారణం.  ఆఫ్రికా, యునైటెడ్‌ ఎమిరేట్స్‌ నుంచి ఎక్కువగా పేషెంట్స్‌ వస్తుండడం గమనార్హం. నైజీరియా, సూడాన్‌, మిడిల్‌ ఈస్ట్‌ దేశాలైన ఒమన్‌, ఇరాక్‌,  యెమెన్‌, బంగ్లాదేశ్‌, ఆఫ్ఘాన్‌ నుంచి వస్తున్నారు. ఎల్‌వీ ప్రసాద్‌ ఐ ఇనిస్టిట్యూట్‌ని ఒమన్‌, నేపాల్‌, బంగ్లాదేశ్‌ నుంచి కూడా రోగులు వస్తుంటారు.

దేశంలో మెడికల్‌ టూరిజంలో హైదరాబాద్‌ నాలుగో స్థానంలో ఉంది. ఢిల్లీ, ముంబై, చెన్నై తరువాత హైదరాబాద్‌కే అత్యధికంగా విదేశీయులు వైద్యం కోసం వసు ్తన్నారు. ఎక్కువగా సర్జరీల కోసం హైదరాబాద్‌కి వస్తుండడం గమనార్హం. ఇలా వచ్చేవారు హార్ట్‌ సర్జరీ, జాయింట్‌ రీప్లేస్‌మెంట్స్‌, రోబోట్‌ సహాయంతో బ్రెయిన్‌  అండ్‌ స్పైన్‌ సర్జరీ, బోన్‌ మారో ట్రాన్స్‌ప్లాంట్స్‌, క్యాన్సర్‌ ట్రీట్‌మెంట్‌, బరియాటిక్‌ సర్జరీ, డెంటల్‌ ట్రీటీమెంట్‌, హార్ట్‌ అండ్‌ లంగ్‌ ట్రాన్స్‌ప్లాంట్‌, గ్యాస్ట్రోలజీ వంచి చికిత్స నగరం ఆసుపత్రుల నుంచి పొందుతున్నారు.

హైదరాబాద్‌ అపోలో లోనే 1.5 లక్షల మంది విదేశీయులు చికిత్స పొందారు. ప్రముఖ ఆసుపత్రుల్లో దాదాపు 20వేల మందికిపైగానే విదేశీయులు చికిత్స పొందారు. అపోలో ఆసుపత్రి జూబ్లీహిల్స్‌ క్యాంపస్‌లో విదేశీ రోగుల కోసం ప్రత్యేకంగా ఇంటర్నేషనల్‌ బ్లాక్‌ని సైతం ఏర్పాటు చేశారంటే నగరంలో విస్తరిస్తున్న మెడికల్‌ టూరిజం వేగాన్ని అర్థం చేసుకోవచ్చు.