పర్యాటకంలో అమెరికా పెట్టుబడులు!

పర్యాటకంలో అమెరికా పెట్టుబడులు!

14-03-2017

పర్యాటకంలో అమెరికా పెట్టుబడులు!

తెలంగాణలో పర్యాటకంపై పెట్టుబడులు పెట్టేందుకు అమెరికా ముందుకు వచ్చింది. అమెరికా నుంచి వచ్చిన బృందం తెలంగాణ ప్రాంతంలోని టూరిజం కట్టడాలను పరిశీలించి  ఇక్కడి అభివృద్ధికి పెట్టుబడులు పెట్టేందుకు సంసిద్ధత వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఉన్న చారిత్రక, వారసత్వ కట్టడాల చరిత్రను అడిగి తెలుసుకున్నారు. తెలంగాణ రాష్ట్రంలో టూరిజం అభివృద్ధికి అపారమైన అవకాశాలు ఉన్నాయని పర్యాటక శాఖ కార్యదర్శి బుర్రా వెంకటేశం వారికి తెలిపారు. అమెరికా నుంచి వచ్చిన ప్రతినిధుల బృందంతో పర్యాటక, సాంస్కృతిక శాఖ కార్యదర్శి వెంకటేశంతోపాటు పర్యాటక శాఖ ఎండీ క్రిస్టీనా జడ్‌ ఛోంగ్తు, మాజీ చీఫ్‌ సెక్రెటరీ ప్రదీప్‌చంద్ర, ప్రభుత్వ సలహాదారు పాపారావు తదితరులు సమావేశమయ్యారు.