రూ.1,91,063.61 కోట్లతో ఏపీ బడ్జెట్

రూ.1,91,063.61 కోట్లతో ఏపీ బడ్జెట్

08-03-2018

రూ.1,91,063.61 కోట్లతో ఏపీ బడ్జెట్

2018-19 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రూ.1,91,063.61 కోట్ల బడ్జెట్‌ను మంత్రి యనమల రామకృష్ణుడు అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. బడ్జెట్‌లో సంక్షేమ రంగానికి ప్రభుత్వం పెద్దపీట వేసింది. రాష్ట్ర విభజనతో ఆదాయం తగ్గిపోయిందని, కేంద్రం నుంచి సకాలంలో సాయం అందక ఇబ్బందులు పడ్డామని చెప్పుకొచ్చారు. ఆయా శాఖలకు బడ్జెట్‌లో కేటాయింపులు ఈ విధంగా ఉన్నాయి.

మొత్తం బడ్జెట్‌ రూ.1,91,063.61 కోట్లు
రెవెన్యూ వ్యయం రూ.1,50,270.99 కోట్లు
మూలధన వ్యయం రూ.28.678.49 కోట్లు
గతంలో పోలిస్తే 21.70 శాతం పెరిగిన బడ్జెట్‌

బడ్జెట్‌ కేటాయింపులు :

న్యాయశాఖకు రూ.886 కోట్లు
హోంశాఖకు రూ.6226 కోట్లు
పర్యాటకశాఖ రూ.290 కోట్లు
సీఆర్డీఏకు రూ.7761 కోట్లు
వ్వవసాయశాఖ రూ.12,355 కోట్లు
గ్రామీణాభివృద్ధి రూ.20,815 కోట్లు
సాగునీటి రంగం రూ. 16,078 కోట్లు
పరిశ్రమలు, గనులు రూ.3074 కోట్లు
రవాణాశాఖ రూ.4653 కోట్లు
విద్యాశాఖ రూ.24,185 కోట్లు
క్రీడలు, యువజన రూ.1635 కోట్లు
సాంకేతిక విద్య రూ.818 కోట్లు
వైద్యారోగ్యశాఖ రూ.8463 కోట్లు
నీటిసరఫరా రూ.2623 కోట్లు
గృహనిర్మాణం రూ.3679 కోట్లు
పట్టణాభివృద్ది రూ.7740 కోట్లు
సంక్షేమరంగం రూ.13720 కోట్లు
ఇంధన రంగానికి రూ.5052 కోట్లు
సమాచార పౌరసంబంధాల శాఖ రూ.224 కోట్లు
కార్మికశాఖ రూ.900 కోట్లు
బీసీ సంక్షేమానికి రూ.12,200 కోట్లు
కాపుల సంక్షేమానికి రూ.1,000 కోట్లు
మేదరుల సంక్షేమానికి రూ.30 కోట్లు
నాయి బ్రహ్మణుల కోసం రూ.30 కోట్లు
వైశ్యుల సంక్షేమం కోసం రూ.30 కోట్లు
ఎన్టీఆర్‌ ఫించన్లకు రూ.5,000 కోట్లు
ఎన్టీఆర్‌ ఆరోగ్య సేవలకు రూ.1000 కోట్లు
స్వచ్ఛభారత్‌ కోసం రూ.1,450 కోట్లు