టీడీపీ దారిలోనే బీజేపీ కూడా

టీడీపీ దారిలోనే బీజేపీ కూడా

08-03-2018

టీడీపీ దారిలోనే బీజేపీ కూడా

తెలుగుదేశం పార్టీకి చెందిన ఎంపీలు అశోక్‌గజపతిరాజు, సుజనాచౌదరిలు కేంద్రమంత్రి పదవులకు నేడు రాజీనామాలు సమర్పించనున్నారని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడించిన నిమిషాల తరువాత నవ్యాంధ్ర రాజకీయం శరవేగంగా మారిపోయింది. విజయవాడలో సమావేశమైన బీజేపీ నేతలు, ఎమ్మెల్యేలు కూడా సంచలన నిర్ణయాన్ని తీసుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వ మంత్రివర్గంలో ఉన్న కామినేని శ్రీనివాస్‌, పైడికొండల మాణిక్యాలరావులు రాజీనామా చేయనున్నారని బీజేపీ శాసనసభాపక్ష నేత విష్ణుకుమార్‌ రాజు వెల్లడించారు. రాత్రి 11:30 గంటల సమయంలో ప్రత్యేక మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. చంద్రబాబునాయుడు గతంలో కూడా ఇదే విధమైన మోసం చేశారని, ఆపై పదేళ్ల పాటు అధికారానికి దూరమయ్యారని విమర్శించారు. బాబు ఈ నిర్ణయం తీసుకుంటారన్న విషయం తమకు ముందుగానే తెలుసునని చెప్పారు.