సీఎం చంద్రబాబు సంచలన ప్రకటన
APEDB

సీఎం చంద్రబాబు సంచలన ప్రకటన

08-03-2018

సీఎం చంద్రబాబు సంచలన ప్రకటన

కేంద్ర మంత్రి వర్గం నుంచి తెలుగుదేశం పార్టీ వైదొలుగుతున్నట్లు ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సంచలన ప్రకటన చేశారు. పార్టీకి చెందిన ఇద్దరు మంత్రులు అశోక్‌గజపతిరాజు, సుజనాచౌదరి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. విభజనతో నష్టపోయిన ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం అభివృద్ధి, ప్రజా ప్రయోజనాల కోసమే తమ పార్టీ కేంద్ర మంత్రి వర్గంలో భాగస్వామ్య మైందని, ఆ ప్రయోజనాలు నెరవేరనపుడు గౌరవంగా తప్పుకోవదమే మంచిదని భావించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.