తెగతెంపులా...మైత్రీనా?

తెగతెంపులా...మైత్రీనా?

07-03-2018

తెగతెంపులా...మైత్రీనా?

భారతీయ జనతాపార్టీతో మైత్రీని కొనసాగించాలా వద్దా అనే అంశంపై ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి, పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు తీసుకునే నిర్ణయానికి కట్టుబడి ఉంటామని ఉత్తరాంధ్ర జిల్లాలకు చెందిన మంత్రులు, శాసనసభ్యులు, ఎమ్మెల్సీలు సృష్టం చేశారు. అమరావతిలో జరిగిన తెలుగుదేశం పార్టీ శాసనసభా పక్ష సమావేశంలో చంద్రబాబు నిర్వహించిన పోలింగ్‌లో బీజీపీతో తెగతెంపులు చేసుకునే ప్రతిపాదన పట్ల ఉత్తరాంధ్రా జిల్లాలకు చెందిన ఎమ్మెల్యేలు ఓటు వేశారని తెలిసింది. రాష్ట్రానికి సంబంధించి అన్ని సమస్యలతో పాటు ఉత్తరాంధ్రకు ముఖ్యమైన రైల్వేజోన్‌ ఇవ్వకపోవడం పట్ల కేంద్రంపై ఈ ప్రాంతానికి చెందిన తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు  అసంతృప్తితో ఉన్నారు. ప్రజల అసంతృప్తిని ముఖ్యమంత్రికి వివరించిన ఉత్తరాంధ్ర జిల్లాలకు  చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు వెంటనే బీజీపీతో తెగతెంపులు చేసుకోవాలని కోరినట్టు తెలిసింది. రాష్ట్ర మంత్రి వర్గంలో ఉత్తరాంధ్రకు ప్రాతినిధ్యం వహిస్తున్న కిమిడి కళావెంకట్రావు, సుజన కృష్ణరంగారావు, గంటా శ్రీనివాసరావు, అయ్యన్నపాత్రుడుతో సహా పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలందరూ బీజేపీతో మైత్రీ బంధాన్ని తెగతెంపులు చేసుకోవాలని చంద్రబాబునాయుడుకు సూచించినట్టు తెలిసింది.