ఆంధ్రప్రదేశ్‌కు డెలాయిట్‌, హెచ్‌పి!

ఆంధ్రప్రదేశ్‌కు డెలాయిట్‌, హెచ్‌పి!

07-03-2018

ఆంధ్రప్రదేశ్‌కు డెలాయిట్‌, హెచ్‌పి!

ఆంధ్రప్రదేశ్‌లో కంపెనీ ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదనలపై డెలాయిట్‌, హెచ్‌పీ సానుకూలంగా స్పందించాయి. రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్‌ ఢిల్లీ పర్యటన సందర్భంగా కంపెనీల సిఇఒలతో భేటీ అయ్యారు. ఎపీతో కలిసి పని చేసేందుకు తాము సిద్ధంగా ఉన్నామని, త్వరలోనే పూర్తిస్థాయి ప్రతిపాదనలతో ఏపీకి వస్తామని డెలాయిట్‌ సిఇఒ పునీత్‌ రెంజెన్‌ తెలిపారు. హెచ్‌పి కంపెనీ ప్రతినిధులతోనూ లోకేశ్‌ భేటీ అయ్యారు. ఆ సంస్థ మేనేజర్‌ అమితాబ్‌ నాగ్‌ ఏపీ లో కంపెనీ ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదనలపై సానుకూలంగా స్పందించారు. హెచ్‌పి ఉత్పత్తుల ప్లాంటును ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలిస్తామని అన్నారు. నోబెల్‌ గ్రూప్‌ కన్స్యూమర్‌ ఎలక్ట్రానిక్స్‌ డైరెక్టర్‌ సరబ్‌జిత్‌ సింగ్‌, యాహో మొబైల్‌ కంపెనీ ఎండీ చన్ప్రీత్‌ సింగ్‌, కిమాషీ ఎలక్ట్రానిక్స్‌ సిఇఒ అనిల్‌ గుప్తాలతో లోకేష్‌ విడివిడిగా భేటీ అయ్యారు.