కేంద్రం నుంచి సృష్టత వచ్చేంత వరకు పోరాటం : చంద్రబాబు

కేంద్రం నుంచి సృష్టత వచ్చేంత వరకు పోరాటం : చంద్రబాబు

06-03-2018

కేంద్రం నుంచి సృష్టత వచ్చేంత వరకు పోరాటం : చంద్రబాబు

కేంద్రం నుంచి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి రావాల్సిన హామీల అమలుపై సృష్టత రావాల్సిందేనని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పార్టీ ఎంపీలకు సృష్టం చేశారు. పార్టీ ఎంపీలు, తెలుగుదేశం సమన్వయకమిటీ సభ్యులతో టెలీకాన్ఫరెన్స్‌ నిర్వహించారు. కేంద్రం నుంచి అన్ని అంశాల్లో సృష్టత వచ్చేంత వరకు పోరాటం ఆపోద్దని ఎంపీలకు సృష్టం చేశారు. జైట్లీతో గత రాత్రి సమావేశ వివరాలను ఎంపీ తోటనరసింహ ముఖ్యమంత్రికి వివరించారు. సమావేశానికి అమిత్‌షా హాజరుకాకపోవడంతో రెండు అంశాలపై మాత్రమే చర్చ జరిగిందని, మిగిలినవి వాయిదా వేశామని ఎంపీలు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకొచ్చారు. విభజన హామీలు అన్ని సాధించేవరకు మన వైఖరిలో మార్పులేదని ఎంపీలకు ముఖ్యమంత్రి తేల్చి చెప్పారు.