శ్రీవారి ఆలయంలో 18న ఉగాది ఆస్థానం

శ్రీవారి ఆలయంలో 18న ఉగాది ఆస్థానం

06-03-2018

శ్రీవారి ఆలయంలో 18న ఉగాది ఆస్థానం

తిరుమల శ్రీవారి ఆలయంలో శ్రీవిళంబినామ సంవత్సర ఉగాది ఆస్థానాన్ని ఈ నెల 18న నిర్వహించనున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఓ ప్రకటనలో తెలిపింది. ఆ రోజు వేకువజామున మూడింటికి సుప్రభాత సేవ అనంతరం ఆలయ శుద్ధి చేపడతారు. తోమాల సేవ ఏకాంతంగా పూర్తి చేశాక బంగారువాకిలి వద్ద పంచాంగ శ్రవణాన్ని నిర్వహిస్తారు. ఉగాది ఆస్థానంలో భాగంగా బంగారువాకిలిలో ఆగమ పండితులు, అర్చకులు పంచాంగ పఠనాన్ని శాస్త్రోక్తంగా నిర్వహిస్తారు. ఈ పర్వదినాన్ని పురస్కరించుకుని శ్రీవారికి ఆర్జిత సేవలైన కల్యాణోత్సవం, ఊంజల్‌సేవ, ఆర్జిత బ్రహ్మూెత్సవం, వసంతోత్సవానలు టీటీడీ రద్దు చేసింది. ఉగాదికి ముందు మంగళవారమైన ఈ నెల 13న కోయిల్‌ఆళ్వార్‌  తిరుమంజనం నిర్వహించనుంది.