నవ్యాంధ్రలో మరో ప్రతిష్ఠాత్మక సంస్థ

నవ్యాంధ్రలో మరో ప్రతిష్ఠాత్మక సంస్థ

05-03-2018

నవ్యాంధ్రలో మరో ప్రతిష్ఠాత్మక సంస్థ

నవ్యాంధ్రలో మరో ప్రతిష్ఠాత్మక పరిశ్రమ ఏర్పాటు కానుంది. వస్త్ర రంగంలో  ప్రపంచ వ్యాప్తంగా పేరున్న అరవింద్‌ లిమిటెడ్‌ను చిత్తూరు జిల్లాలో ఏర్పాటు చేసేందుకు ఒప్పందం కుదిరింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమక్షంలో ఏపీ ఎకనామిక్‌ డెవలప్‌మెంట్‌ బోర్డు (ఏపీఈడీబీ) సీఈవో జె.కృష్ణాకిశోర్‌, అరవింద్‌ సంస్థ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ కులిన్‌ లాల్‌భాయ్‌ ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు. చిత్తూరు జిల్లాలో ఈ పరిశ్రమ స్థాపనకు రాష్ట్ర ప్రభుత్వం 100-125 ఎకరాలు కేటాయించింది. రూ.250 నుండి రూ.300 కోట్ల  ప్రారంభ పెట్టుబడితో మొదటి దశ పనులు ప్రారంభించనున్నారు. ఈ పార్కు ఏర్పాటు పూర్తి అయితే 10 వేల మందికి ఉపాధి అవకాశాలు దక్కే అవకాశం ఉంది.