టీడీపీ గూటికి వైసీపీ నేత సునీల్?

టీడీపీ గూటికి వైసీపీ నేత సునీల్?

05-03-2018

టీడీపీ గూటికి వైసీపీ నేత సునీల్?

వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ తూర్పు గోదావరి జిల్లా ముఖ్య నేత, పారిశ్రామికవేత్త చలమలశెట్టి సునీల్‌ తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకోవడానికి రంగం సిద్ధమయింది. ఈ మేరకు సునీల్‌తో అధికార టీడీపీకి చెందిన ప్రముఖ నేతలు విస్తృతంగా చర్చలు జరిపినట్లు విశ్వసనీయంగా తెలిసింది. సునీల్‌  పార్టీ తీర్థం పుచ్చుకున్నట్టు ప్రకటించిన తర్వాత రాజ్యసభ ఎన్నికలకు 3వ అభ్యర్థిగా బరిలో ఉంచే ప్రతిపాదనకు టీడీపీ అధినేత చంద్రబాబు నుండి గ్రీన్‌ సిగ్నల్‌ లభించినట్లు సమాచారం. చర్చలు విజయవంతం కావడంతో ఇక సునీల్‌ టీడీపీలో చేరడం ఖాయమని తెలిసింది.