అద్దంకిలో వైయస్ జగన్ ప్రజాసంకల్పయాత్ర

అద్దంకిలో వైయస్ జగన్ ప్రజాసంకల్పయాత్ర

04-03-2018

అద్దంకిలో వైయస్ జగన్ ప్రజాసంకల్పయాత్ర

అశేష ప్రజానీకాన్ని ఉద్దేశించి ప్రసంగించిన వైయస్ జగన్

వైయస్ జగన్ ప్రసంగంలోని ముఖ్యాంశాలు: 

అన్నా నీకు తోడుగా మేమంతా ఉన్నామంటూ.. నాతో పాటు మీరంతా అడుగులో అడుగులు వేశారు. చంద్రబాబు ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి ఆయనతో పాటు కరువు అడుగులో అడుగు వేసింది. ఖరీప్, రబీ రెండూ కలుపుకుంటూ -32 శాతం వర్షపాతం లోటు నమోదైంది. రబీ పంటనే చూసుకుంటే అక్టోబర్, డిసెంబర్, జనవరిలో చుక్క వర్షం పడలేదు. -95, 98 శాతం వర్షపాతం లోటు. ఇంత దారుణంగా కరువు పరిస్థితులు నెలకొన్నాయి. రైతన్న వ్యవసాయం చేయలేని పరిస్థితులో ఉంటే.. రైతన్నను ఆదుకునేందుకు ముఖ్యమంత్రి ముందుకు రావాలి. ఖరీఫ్ లో కరువు వస్తే.. రబీ కల్లా ఇన్ పుట్ సబ్సిడీ ఇప్పించాలని ప్రయత్నిస్తారు. ఖరీఫ్ లో రైతన్నలు ఇన్స్యూరెన్స్ సొమ్ము కడితే.. రాష్ట్ర ప్రభుత్వం తరుపున ఇంతవరకు సొమ్ము కట్టలేదు. రైతన్నను ఆదుకోవాలి. తోడుగా ఉండాలనే ఆలోచన ఈ ప్రభుత్వానికి లేదు. రైతన్నలు పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు కూడా రావటం లేదు. నాలుగు సంవత్సరాల చంద్రబాబు పాలనలో ఏ ఒక్క పంటకైనా గిట్టుబాటు ధరైనా వచ్చిందా అని శ్రీ వైయస్ జగన్ నిలదీశారు. ఏ పంటకూ గిట్టుబాటు ధర రాలేదు. చంద్రబాబు రాజకీయాలు చేయటం మొదలు పెట్టారు.

ఈ జిల్లాలో  కందలు, శెనగలు వేశారు గిట్టుబాటు ధరలు రావటం లేదని శ్రీ వైయస్ జగన్ నిలదీస్తున్నారని నామ్ కే వాస్తేగా ప్రకటన ఇచ్చారు. రైతులు తీసుకువెళ్లి అమ్ముదామంటే 4వేలు కూడా గిట్టుబాటు ధర వచ్చే పరిస్థితి కనపడటం లేదు. నాన్నగారి హయాంలో 9వేలు అమ్ముకుంటే.. ఇప్పుడు కనీస మద్దతు ధర రూ.5,400 కూడా రైతన్నకు అందని పరిస్థితి ఉంది. కనీస మద్దతు ధరకు కొంటామని పేపర్ స్టేట్ మెంట్ ఇచ్చారు. కందులు తీసుకొని మార్కెట్ యార్డులకు వెళ్తే రెండే రెండు బస్తాలు కొంటారట. దాంట్లో తేమ శాతం ఎక్కువ ఉందని తీసుకోం పో.. అంటున్నారు. ఎలా కత్తిరించాలని చూస్తున్నారు. మళ్లీ దళారుల దగ్గరకు వెళ్లి రూ.4వేలకు అమ్ముకునే పరిస్థితి తెస్తున్నారు. ఆ దళారుల నుంచి లంచాలు పుచ్చుకొని మళ్లీ రూ.5,400 ఇస్తున్నారు. అసలు ప్రభుత్వానికి మానవత్వం ఉందా? అని శ్రీ వైయస్ జగన్ నిలదీశారు. 

సాగర్ నీరు ఈ ప్రాంతం నుంచే వెళ్తాయి. బాబు ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి సాగర్ కుడికాల్వలో మాగాణి వేసుకున్నారు. బాబు ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి వరి పంట ఏనాడూ వేసుకోలేదు. తెలంగాణలో ఎడమ కాల్వ వెళ్తోంది. అక్కడ రైతులు వరి వేసుకుంటున్నారు. రైతులు వచ్చి.. అక్కడ ముఖ్యమంత్రికి కేసీఆర్ కు ఉన్నదేమిటి? మన ముఖ్యమంత్రికి లేనిది ఏమిటో అర్థం కావటం లేదంటున్నారు. అంత దారుణంగా పరిపాలన సాగిస్తున్నారు. 

కేసీఆర్ దగ్గర ఉన్నవి, బాబు దగ్గర లేనివి ఓటుకు కోట్లు కేసు టేపులు. గత నాలుగేళ్లుగా చంద్రబాబు పరిస్థితి ఇది. ఇటు కేంద్రంలో మోడీ గారికి భయపడుతున్నారు. విచ్చలవిడిగా అవినీతి జరుగుతోంది. 

పైనేమో చంద్రబాబు  ఇసుక నుంచి మట్టిదాక.. మట్టి నుంచి బొగ్గుదాకా, బొగ్గు నుంచి మద్యందాకా, మద్యం నుంచి కరెంటు కొనుగోళ్లు వరకు ఏదీ వదిలిపెట్టడం లేదు. కరెంటు కొనుగోళ్లు నుంచి కాంట్రాక్టర్ల వరకు, కాంట్రాక్టర్ల నుంచి రాజధాని భూములు, గుడి భూములూ బాబు తినుడే తినుడు అంటూ విపరీతమైన అవినీతి చేస్తున్నారు.  పైన బాబు అవినీతి చేస్తుంటే కింద జన్మభూమి కమిటీలు పింఛన్లు, మరుగుదొడ్లు కావాలన్నా లంచాలు ఇవ్వాల్సిందే.

పక్కనే మన అందరికీ గుండ్లకమ్మ ప్రాజెక్టు కనిపిస్తుంది. గుడ్లకమ్మ నీళ్లు, సాగర్ కుడికాల్వ నీళ్లు ఈ ప్రాంతానికి అవసరమైనవి. ఎన్నికలు వచ్చినప్పుడు చంద్రబాబు వచ్చి కొబ్బరికాయ కొట్టి వెళ్తాడు. ప్రియతమ నేత రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక రూ.600 కోట్లతో ఆయనే టెంకాయ కొట్టి.. పూర్తి చేసి జాతికి అంకితం చేశారు. ప్రియతమ నేత తర్వాత మన మధ్య నుంచి వెళ్లిపోయారు. గుండ్లకమ్మ కాల్వలు గురించి చంద్రబాబు పట్టించుకోవటం లేదు. 52వేల ఆయకట్టు ఉంటే.. ఇవాళ్టికి చివరి 5వేల ఎకరాలకు నీరు అందని పరిస్థితి ఉంది. ఎడమకాల్వలో సుమారు 28వేల ఆయకట్టులో 12వేల ఎకరాలకు నీరు అందటం లేదు. ఇంతదారుణమైన పరిస్థితిలో ఉంది. 13 కోట్ల మిగిలిపోయిన పనులను రూ.160 కోట్లకు పెంచి లంచాలు తీసుకునే ప్రయత్నం చేశారు. 

భావనాసి రిజర్వాయర్ కనిపిస్తుంది. ఆ దివంగత నేత కనిపిస్తుంది. 170 కోట్లతో ఆ ప్రాజెక్టు పూర్తి చేయాలని రిజర్వాయర్ చేయాలని అప్పట్లోనే భూసేకరణ పూర్తి చేశారు. ఇవాళ్టికి కనీసం ఆ ప్రాజెక్టు ఉందన్న సంగతి చంద్రబాబుకు తెల్సా అని శ్రీ వైయస్ జగన్ నిలదీశారు. 

నాలుగేళ్ల నుంచి రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్ ధరలు బాదుడు. తమిళనాడు, కర్నాటక, తెలంగాణల కన్నా రూ.7లు ఎక్కువ బాదుతున్నారు. 

ఎన్నికల ముందు వరకు విద్యుత్ ధరలు పెరిగాయన్న బాబు .. ముఖ్యమంత్రి అయ్యాక మూడు సార్లు చార్జీలు బాదారు. దీంతో ఇప్పుడు ప్రతి ఇంటికీ వెయ్యి రూపాయలు కరెంటు బిల్లు వస్తోంది. అంతేకాకుండా కరెంటోళ్లు ఇంటికి వెళ్లి పెనాల్టీలు వేస్తున్నారు. 

గతంలో రేషన్ షాపుల్లో బియ్యం, చక్కెర, కందిపప్పు, పామాయిల్, గోధుమపిండి, గోధుమలు, కారం, ఉప్పు, పసుపు, చింతపండు, కిరోసిన్ అన్నీ ప్యాక్ చేసి రూ.185కే చేతుల్లో పెట్టేవారు. ఇప్పుడు బాబు ముఖ్యమంత్రి అయ్యాక రేషన్ షాపుల్లో బియ్యం తప్పు ఇంకేమీ దొరకటం లేదు. ఆ బియ్యం కూడా ఇంట్లో 6 మంది ఉంటే కనీసం ఇద్దరికి వేలిముద్రలు పడటం లేదని కటింగ్ చేస్తున్నారు. 

అధికారంలోకి రాగానే బెల్ట్ షాపులు తొలగిస్తామని చంద్రబాబు చెప్పారు. మరి, ఈనాడు గ్రామాల్లో మినరల్ వాటర్ ప్లాంట్ ఉందో లేదో తెలీదు గానీ, మద్యం దొరకని గ్రామం ఏదైనా ఉందా?

- ఫోన్ కొడితే మినరల్ వాటర్ తీసుకురారు. అదే ఫోన్ కొడితే మద్యం ఇంటికి డెలివరీ చేస్తారు. 

ఈ పెద్దమనిషి చేస్తున్న మోసాలు చూడండి. ఈ రుణాలు మీరు కట్టొద్దు అంటూ.. బ్యాంకుల్లో పెట్టిన బంగారం ఇంటికి రావాలన్నా, వ్యవసాయ రుణాలు పూర్తిగా బేషరుతుగా మాఫీ కావాలంటే బాబు ముఖ్యమంత్రి కావాలన్నారు. 

- బ్యాంకుల్లో పెట్టిన బంగారం ఇంటికి వచ్చిందా? అంటే రాలేదు. 
- బ్యాంకులు బంగారం వేలం వేస్తున్న నోటీసులు వస్తున్నాయ్. 
- పొదుపు సంఘాల అక్కచెల్లెమ్మలను బాబు మోసం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆడవాళ్లు కన్నీరు కారుస్తున్నారు. 

జాబు రావాలంటే బాబు రావాలన్నారు.ఎన్నికలప్పుడు ప్రతి ఇంటికీ టీడీపీ కార్యకర్తలు వెళ్లి బాబు సంతకం పెట్టారని ఏం చదవకపోయినా ఉద్యోగం ఇస్తారంటూ.. పాంప్లేట్ పంచారన్నారు. 45-47 నెలలు అయింది. నెలకు 2వేలు చొప్పన ప్రతి ఇంటికీ రూ.96 వేలు బాబు బాకీ ఉన్నారు. బాబు కనిపిస్తే రూ.96వేల పరిస్థితి ఏంటని అడగండి. 

పెన్షన్లు.. ఇవ్వటం లేదా? నాకు తెలీదు, రేషన్ కార్డు ఇవ్వటం లేదా? నాకూ తెలీదే.. చాలా మందికి ఇవ్వటం లేదా నాకు తెలీదే.. ఆరోగ్యశ్రీ హైదరాబాద్  వెళ్తే ఇవ్వటం లేదా? అయ్యే నాకు తెలీదే అంటూ చంద్రబాబు అంటున్నారు. ప్రత్యేకహోదా 14వ ఆర్థిక సంఘం వద్దనలేదనే సంగతి ఇప్పుడే నాకు తెల్సిందని చంద్రబాబు ఇలా ఉన్నాయని ఇలాంటివి చాలా ఉన్నాయని జిమ్మిక్కులు, డ్రామాలు చేస్తున్నారన్నారు. ఈ సందర్భంగా కథను శ్రీ వైయస్ జగన్ తెలిపారు. కొండ చిలువ కొట్టుకుపోతుంటే ఓ మంచి మనిషి కాపాడాడు. ఆ కొండ చిలువ ఆ మనిషి కోళ్లు, పశువులను తినటం మొదలుపెట్టాయి. దీంతో ఆ మంచి మనిషి కొండ చిలువను పదేళ్లు బహిష్కరించాడు. తర్వాత కొండచిలువ మళ్లీ మంచి మనిషి దగ్గరకు వచ్చి నేను మారాను అంటూ.. కోరింది. పోనీలే అని క్షమించి.. కొండచిలువను ఉంచితే.. అది బుద్ధి మార్చకోలేదు. ఆ మనిషిని దగ్గరున్న మేకలు, కోళ్లనే కాక.. ఆవు దూడలను కూడా తినటం మొదలుపెట్టేసింది. ఈ మనిషికి విసుగెక్కి.. కొండచిలువను ఏదో ఒకటి చేయాలని నిర్ణయానికి వచ్చేశాడు. మనిషి ఏదో ఒకటి చేయాలని నిర్ణయానికి వస్తే.. అతన్ని చుట్టూ పెనేసుకుని.. ప్రేమ చూపించేది. దీంతో ఆ మంచి కొండచిలువను డాక్టర్ దగ్గరకు తీసుకువెళ్తే.. ఇది మాయదారి కొండచిలువ అని చెప్పారు. దానిబలంతో నిన్ను నమిలేయగలదో చూసుకుంటోంది. నీతల దాని నోట్లో పడుతుందో లేదో చూసుకుంటోందని డాక్టర్ చెప్పారు. తస్మాత్ జాగ్రత్త.. కొండచిలువలాగే.. చంద్రబాబు వ్యవహరిస్తున్నారు. పొరపాటున బాబును క్షమిస్తే.. రేపు రాష్ట్రమే మిగలదన్నారు. చంద్రబాబు చిత్తశుద్ధి చూసినప్పడు ఈ మాట చెప్పాల్సి వస్తోందన్నారు. 

ప్రత్యేక హోదా వచ్చినప్పుడే రాష్ట్రానికి మేలు జరుగుతుంది. ఊసరవెల్లికి ఎన్ని రంగులు ఉంటాయో తెలీదు కానీ చంద్రబాబు పూటకో రంగు మారుస్తున్నారని అర్థమౌతోందన్నారు. నిన్న వాళ్ల పార్లమెంటరీ పార్టీ మీటింగ్ పెట్టుకొని.. ప్రత్యేక హోదా వద్దనలేదని, దశల వారీగా పోరాటం చేస్తాం.. మంత్రిపదవుల రాజీనామా ఆఖరి అస్త్రమని చంద్రబాబు అంటున్నారు.  

మార్చి 1న కలెక్టరేట్లు దిగ్భందం చేశాం. హోదా మా హక్కు ప్యాకేజీలతో మోసం చేయెద్దు అని శ్రీ వైయస్ జగన్ పిలుపు ఇచ్చారు. మార్చి3న ఢిల్లీకి ప్రత్యేక రైలు బయలుదేరింది. పార్లమెంట్ లో మన ఎంపీలు హోదా కోసం వీరోచిత పోరాటం చేస్తారు. అప్పటికీ కేంద్రం స్పందించపోతే .. అవిశ్వాసం పెడతాం. చివరి రోజున ఏప్రిల్ 6న ఎంపీలు రాజీనామాలు చేసి రాష్ట్రానికి తిరిగి వస్తారు. ఇదీ పోరాటం అంటే. 

చంద్రబాబు పార్టనర్ చిత్తశుద్ధి ఉంటే అవిశ్వాస తీర్మానం పెట్టండని పిలుపు ఇచ్చారు. మార్చి 21న బాబు పార్టనర్ చెప్పిన సలహాతో అవిశ్వాసం పెట్టడానికి వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందుకు వచ్చింది కాబట్టి.. మిగతా ఎంపీలంతా..మద్దతు ఇవ్వాలి. అప్పుడు కేంద్రం దిగిరాదా? కానీ చంద్రబాబు కలిసిరారట. ఆ తర్వాత అప్పటికీ కేంద్రం దిగిరాకపోతే ఏప్రిల్ 6వ తారీఖున ఎంపీలంతా రాజీనామా చేయటం. ఇది చివరి అస్త్రం. ఈ మాదిరిగా చేస్తే కేంద్రమైనా దిగి వస్తుంది. ఏపీ అంతా ఒక్కతాటిగా ఉందని హోదా ఇస్తారు. కానీ చంద్రబాబు ఇవేమీ చేయరట. 

పొరపాటున చంద్రబాబును క్షమిస్తే .. మీదగ్గరకు వచ్చి చిన్నచిన్న అబద్ధాలకు లొంగరని తెల్సు. పెద్ద పెద్ద అబద్ధాలు, పెద్దపెద్ద మోసాలు చేస్తారు. 

- ప్రతి ఇంటికి కేజీ బంగారం ఇస్తామంటారు. నమ్మరని మూడు వేలు ఇస్తారు. మూడు వేలు కాదు.. ఐదువేలు గుంజండి. అబద్ధాలు, మోసాలు చేసేవారిని బంగాళాఖాతంలో కలిపే పరిస్థితి తీసుకురావాలన్నారు. 

- చెడిపోయిన రాజకీయ వ్యవస్థలోకి మార్పు రావాలి. రేపొద్దున దేవుడు ఆశీర్వదించి మనందరి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక.. నవరత్నాలు అమలు చేస్తాం. 

ఈ సందర్భంగా ఆరోగ్యశ్రీలో మార్పులు చేర్పులు గురించి వైయస్ జగన్ వివరించారు.