అందుకోసమే అసెంబ్లీకి వెళ్తాం

అందుకోసమే అసెంబ్లీకి వెళ్తాం

03-03-2018

అందుకోసమే అసెంబ్లీకి వెళ్తాం

రాజ్యసభ ఎన్నికల్లో ఓటేసేందుకు అసెంబ్లీకి వెళ్తామని వైసీపీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి తెలిపారు. ప్రకాశం జిల్లా తాళ్లూరులో వైసీపీ ప్రజాప్రతినిధులతో జగన్‌ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విభజన హామీల అమలు కోసం వైసీపీ ఎంపీలో పోరాటం కొనసాగుతుందని సృష్టం చేశారు. ఎంపీల పోరాటానికి నేతలంతా సంఘీభావం తెలపాలని కోరారు. ఫిరాయింపు ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించాలని డిమాండ్‌ చేశారు. అనర్హత వేలు వేసే వరకు పోరాటం కొనసాగిస్తామని సృష్టం చేశారు. వైసీపీ ఎమ్మెల్యేలకు ఎలాంటి ఆఫర్లు ఇస్తున్నారో తన దృష్టికి వచ్చిందన్నారు. ఎవరు వెలెత్తిచూపలేని విధంగా రాజకీయాలు చేస్తానని అన్నారు.