గన్నవరం నుంచి ఇండిగో విమాన సేవలు

గన్నవరం నుంచి ఇండిగో విమాన సేవలు

03-03-2018

గన్నవరం నుంచి ఇండిగో విమాన  సేవలు

గన్నవరం విమానశ్రయం నుంచి ఇండిగో విమానయాన సంస్థ తన కార్యాకలాపాలను ప్రారంభించింది. గన్నవరం నుంచి ఒకేసారి పది సర్వీసులను హైదరాబాద్‌, చెన్నై, బెంగళూరు నగరాలకు ఇండిగో సంస్థ నడుపుతోంది. ఇండిగో సంస్థ కార్యాలయాన్ని విమానాశ్రయం డైరెక్టరు జి.మధుసూదనరావు కొత్త టెర్నినల్‌ భవనంలో ప్రారంభించిన అనంతరం ప్రయాణికులకు బోర్డింగ్‌ పాస్‌లను అందజేశారు. అనంతరం విమానాశ్రయాఇకి చేరుకున్న ఇండిగో విమానానికి ఫైర్‌ఇంజిన్లతో నీటిని జల్లుతూ సిబ్బంది ఘన స్వాగతం పలికారు. 

గన్నవరం నుంచి ప్రతిరోజు ఉదయం 7:55 గంటలకు ప్రారంభించి, హైదరాబాద్‌కు నాలుగు, చెన్నైకు రెండు, బెంగళూరుకు 2 ఇండిగో సర్వీసులు నడుస్తాయి. ఇండిగో ఒకేసారి 10 సర్వీసులను ప్రారంభించడంతో గన్నవరం నుంచి నిత్యం రాకపోకలు సాగించే సర్వీసుల సంఖ్య 53కు చేరింది. ఇండిగో అసోసియేట్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ సానేల్‌ డిసౌజా మాట్లాడుతూ ప్రస్తుతం ఇక్కడి నుంచి 3 నగరాలకు నడుపుతున్నామని, డిమాండ్‌ను బట్టి ఇతర ప్రాంతాలకూ కొత్తవి ఏర్పాటు చేస్తామని తెలిపారు.