వైభవంగా మలయప్ప తెప్పోత్సవం

వైభవంగా మలయప్ప తెప్పోత్సవం

01-03-2018

వైభవంగా మలయప్ప తెప్పోత్సవం

తిరుమల శ్రీవారి వార్షిక తెప్పోత్సవాల్లో భాగంగా నాల్గవ రోజైన బుధవారం మలయప్ప స్వామివారు శ్రీదేవి, భూదేవి సమేతంగా భక్తులకు కనువిందు చేశారు. ముందుగా స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను శ్రీవారి నాలుగు మాడవీధుల్లో ఊరేగించి శ్రీవారి పుష్కరిణీ వద్దకు తీసుకువచ్చారు. రాత్రి 7 గంటలకు విద్యుద్దీపాలతో అందంగా అలంకరించిన తెప్పలపై సర్వాంగ సుందరంగా అలంకరించిన స్వామి, అమ్మవార్లను కొలువుదీర్చారు. అనంతరం వేదపండితుల వేద మంత్రోచ్ఛరణలు, మంగళావాయిద్యాలు, భక్తుల గోవింద నామస్మరణల నడుమ స్వామి, అమ్మవార్లు పుష్కరిణిలో ఐదుసార్లు విహరించారు.