పారిశ్రామిక విప్లవానికి వేదికగా ఏపీ

పారిశ్రామిక విప్లవానికి వేదికగా ఏపీ

28-02-2018

పారిశ్రామిక విప్లవానికి వేదికగా ఏపీ

పారిశ్రామిక విప్లవానికి వేదికగా ఆంధ్రప్రదేశ్‌ వేదిక కాబోతోందని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్‌ అన్నారు. ఇండియన్‌ ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ సెమీ కండక్టర్స్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో బెంగళూరులో జరుగుతున్న విజన్‌ సమ్మిట్‌ 2018లో మంత్రి లోకేష్‌ పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రాష్ట్ర విభజన సందర్భంగా ఎదురైన ఇబ్బందులను ధీటుగా ఎదుర్కొంటూ రాష్ట్రాభివృద్ధి సాధిస్తున్నామన్నారు. ప్రస్తుతం 12 శాతం వృద్ధి సాధించామని పేర్కొన్నారు. క్లస్టర్‌ మోడల్‌ మాత్రమే ఎలక్ట్రానిక్‌ తయారీరంగం అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. చెన్నై బెంగళూరు కారిడార్‌ను ఉపయోగించి ఎలక్ట్రానిక్స్‌ తయారీ రంగాన్ని అభివృద్ధి చేస్తున్నామన్నారు. తిరుపతిలో రిలయన్స్‌ సంస్థ త్వరలో 150 ఎకరాల్లో రోజుకు 10 లక్షల ఫోన్ల తయారీ లక్ష్యంగా జియో మొబైల్‌ తరాయీ కంపెనీని ప్రారంభించబోతోందన్నారు.