ఏపీకి మరో 5 నీట్ సెంటర్లు
Sailaja Reddy Alluddu

ఏపీకి మరో 5 నీట్ సెంటర్లు

28-02-2018

ఏపీకి మరో 5 నీట్ సెంటర్లు

ఆంధ్రప్రదేశ్‌కు కొత్తగా ఐదు నీట్‌ పరీక్ష కేంద్రాలను ప్రకటించామని కేంద్ర మానవవనరుల శాఖ మంత్రి ప్రకాశ్‌ జావడేకర్‌ తెలిపారు. నీట్‌ -2018 పరీక్ష కొత్తగా  ప్రకటించిన కాకినాడ, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, విజయనగరం కేంద్రాల్లో జరుగుతుందని పేర్కొన్నారు. పెరిగిన వాటితో  కలిపి ఇకపై రాష్ట్రంలో మొత్తం 9 పట్టణాల్లో నీట్‌ పరీక్ష జరుగుతుంది. ఈ ఏడాది కొత్తగా దేశవ్యాప్తంగా 43 కేంద్రాల్లో పరీక్ష జరుగుతుందని పేర్కొన్నారు.  2017లో 107 కేంద్రాల్లో  పరీక్ష నిర్వహించగా, ఈ ఏడాది ఆ సంఖ్యను 150కి పెంచామని ఆయన తెలిపారు. తెలంగాణకు కొత్తగా రెండు ( ఖమ్మం, రంగారెడ్డి) కేంద్రాలను కేటాయించారు.