ఏ స్థాయికి చేరుకున్నా ఆది మారిచిపోకూడదు : చంద్రబాబు

ఏ స్థాయికి చేరుకున్నా ఆది మారిచిపోకూడదు : చంద్రబాబు

27-02-2018

ఏ స్థాయికి చేరుకున్నా ఆది మారిచిపోకూడదు  : చంద్రబాబు

జీవితంలో ఏ స్థాయికి చేరుకున్నా ఎక్కడి నుంచి వచ్చామన్నది మాత్రం మరిచిపోకూడదని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన టీడీపీ సమన్వయ కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ  తానెప్పుడూ కష్టాలకు భయపడలేదని, కలిసొచ్చినప్పుడు ఆనందపడలేదని అన్నారు. అను నిత్యం విద్యార్థిలా నేర్చుకుంటూ ఉంటేనే ఎందులోనైనా రాణిస్తారని పేర్కొన్నారు. దేశంలో ఒక్కో పార్టీకి ఒక్కో సిద్ధాంతం ఉండేదన్నారు. ఎన్టీఆర్‌ తెలుగుదేశం పార్టీ పెట్టేటప్పుడు మీ సిద్ధాంతమేమిటని అడిగారని, సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్లు వేరే సిద్ధాంతాలు లేవని ఎన్టీఆర్‌ చెప్పారని గుర్తు చేశారు. ప్రజలు ఆనందంగా లేకపోతే ఎవరూ మనల్ని గుర్తుపెట్టుకోరన్నారు. టీడీపీకి ముందు కాంగ్రెస్‌ పార్టీకి ఎన్నో అవకాశాలు వచ్చాయని, కాసుల కోసం కక్కుర్తితో వాటిని దుర్వినియోగం చేసుకున్నారన్నారు. ప్రముఖ నటి శ్రీదేవి మృతి బాధాకరమని అన్నారు. శ్రీదేవి మృతి పట్ల రకరకాల వాదనలు వస్తున్నాయని ఆయన చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా అభిమానులు సంపాదించుకోవడం అరుదైన విషయమని ఆయన అన్నారు. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ నేతలు రెండు నిమిషాలు మౌనం పాటించారు.