సీఎం చంద్రబాబు నివాసంలో సందడి

సీఎం చంద్రబాబు నివాసంలో సందడి

27-02-2018

సీఎం చంద్రబాబు నివాసంలో సందడి

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నివాసంలో సందడి నెలకొంది. 40 ఏళ్ల రాజకీయ జీవితాన్ని పూర్తి చేసుకున్న సందర్భంగా చంద్రబాబుకు నాయకులు, కార్యకర్తలు అభినందనలు తెలిపేందుకు ఆయన నివాసానికి భారీగా తరలివచ్చారు. ఈ సందర్భంగా తెలుగు యువత నాయకుడు దేవినేని చందు తీసుకొచ్చిన 40 పావురాలను ముఖ్యమంత్రి గాలిలోకి వదిలారు. అలాగే చంద్రబాబు రాజకీయ జీవిత విశేషాలతో ఫొటో ఎగ్జిబిషన్‌ను ఏర్పాటు చేశారు. టీఎన్‌ఎస్‌ఎఫ్‌ కార్యకర్తలు తీసుకొచ్చిన కేక్‌ను చంద్రబాబు కట్‌ చేశారు.