ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు సింగపూర్ ఆసక్తి

ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు సింగపూర్ ఆసక్తి

27-02-2018

ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు సింగపూర్ ఆసక్తి

ఇప్పటివరకు సాంకేతిక పరిజ్ఞానం, రాజధాని నిర్మాణానికి ఆకృతులు అందించిన సింగపూర్‌ ప్రభుత్వం ఇప్పడు ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపుతోందని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి అమర్‌నాథ్‌రెడ్డి తెలిపారు. సింగపూర్‌ మంత్రి ఈశ్వరన్‌, ఆయన బృందం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమక్షంలో ఐటీ, పురపాలక, పరిశ్రమలశాఖ మంత్రులతో సమావేశమైనట్లు చెప్పారు. విశాఖలో నిర్వహించిన మూడు రోజుల భాగస్వామ్య సదస్సులో రూ.4,39,765 కోట్ల పెట్టుబడులకు సంబంధించిన 734 ఒప్పందాలు జరిగాయన్నారు. పూర్తి వివరాలు ముఖ్యమంత్రి వెల్లడిస్తారన్నారు. ఈ ఒప్పందాల వల్ల 11 లక్షల మందికి పైగా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు దక్కుతాయన్నారు. పరిశ్రమలు, పుడ్‌ ప్రాసెసింగ్‌, ఎనర్జీ, మైన్స్‌, నైపుణ్యాభివృద్ధి, పర్యాటక రంగాలలో ఎక్కువ ఉపాధి అవకాశాలు ఉంటాయన్నారు.