పెట్టుబడులకు ఏపీ అనుకూలం : గవర్నర్

పెట్టుబడులకు ఏపీ అనుకూలం : గవర్నర్

27-02-2018

పెట్టుబడులకు ఏపీ అనుకూలం : గవర్నర్

పరిశ్రమల ఏర్పాటు, వ్యాపార అభివృద్ధికి స్నేహపూర్వకమైన విధానాలు అవలంబిస్తూ ఆంధ్రప్రదేశ్‌ సులభతర వాణిజ్యంలో దేశంలోనే ఆగ్రస్థానంలో ఉందని తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్‌ ఈఎస్‌ఎల్‌ నరసింహన్‌ అన్నారు. రాష్ట్రంలో పెట్టే పెట్టుబడులు పూర్తిగా భద్రమని, సురక్షితమని ఆంధ్రప్రదేశ్‌ ప్రథమ పౌరుడిగా తాను భరోసా ఇస్తున్నానని పారిశ్రామికవేత్తలకు ఆయన పిలుపునిచ్చారు. పాలనాపరమైన దక్షత, దార్శనికతలతో ముఖ్మమంత్రి రాష్ట్రాభివృద్ధికోసం నిరంతరం కృషి చేస్తున్నారని కొనియాడారు. పరిశ్రమల స్థాపనకు అవసరమైన రహదారి, రైల్వే, ఓడరేవులు, విమానాశ్రయాల అనుసంధానం ఉందన్నారు. సీఐఐ భాగస్వామ్య సదస్సు ముగింపు సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. 40 ఏళ్ల రాజకీయ జీవితాన్ని పూర్తి చేసుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. పారిశ్రామికవేత్తలు పెట్టుబడికి రక్షణ, పర్యావరణానికి విఘాతం లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. కృతిమ మేధస్సు కన్నా భారత దేశ యువత మేధస్సు శక్తివంతమైనదని, టెక్నాలజీ అనేది ఒక అదనపు వనరుగానే ఉండాలని అభిప్రాయపడ్డారు.