ప్రపంచమంతా ఏపీ వైపు చూస్తోంది
MarinaSkies
Kizen
APEDB

ప్రపంచమంతా ఏపీ వైపు చూస్తోంది

26-02-2018

ప్రపంచమంతా ఏపీ వైపు చూస్తోంది

మన కష్టంతో మన రాష్ట్రాన్ని నిర్మించుకుంటున్నామని, ప్రపంచం మొత్తం ఏపీ వైపు చూస్తోందని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. రాష్ట్రానికి భారీగా పెట్టుబడులు వస్తున్నాయని తెలిపారు. విశాఖ సదస్సు విజయవంతం కావడం శభపరిణామమని అన్నారు. నీరు ప్రగతి, వ్యవసాయంపై ముఖ్యమంత్రి టెలికాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జలసంరక్షణ ఉద్యమం సత్ఫలితాలు ఇస్తోందని అన్నారు. ఏపీలో భూగర్భజలాలు 1.6మీ. పెరిగాయని,  రెండోదశ జలసంరక్షణ ఉద్యమం ఉత్సాహంగా నిర్వహించాలని అధికారులకు సూచించారు. కాలువల్లో నీటి ప్రవాహానికి ఉన్న అవరోధాలు తొలగించాలన్నారు. నరేగా ద్వారా గ్రామాల్లో ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ అభివృద్ధి చేయాలని తెలిపారు. 14వ ఆర్థిక సంఘం నిధులు రూ.745 కోట్లు విడుదల చేశామన్నారు. కరవు మండలాలలో అదనంగా మరో 50 పనిదినాలు కల్పించాలన్నారు. ఇంటర్‌ పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలని, విద్యార్థులకు అన్ని సౌకర్యాలు కల్పించాలని అధికారులను ఆదేశించారు. పెన్షన్ల పంపిణీకి నగదు కొరత లేకుండా చూడాలన్నారు. వేసవిలో పశుగ్రాస కొరత లేకుండా శ్రద్ధ వహించాలని సూచించారు. ఉపాధి హామీ కింద నర్సరీలు అభివృద్ధి చేయాలని తెలిపారు.