సీఐఐ సదస్సులో రవిశంకర్ గురూజీ

సీఐఐ సదస్సులో రవిశంకర్ గురూజీ

26-02-2018

సీఐఐ సదస్సులో రవిశంకర్ గురూజీ

యువతలో ప్రతిభ, ఆత్మవిశ్వాసం, సమాజంపై నమ్మకం ఉంటే ఆ సమాజ అభివృద్ధిని ఎవరూ ఆపలేరని ఆర్ట్‌ ఆఫ్‌ లివింగ్‌ వ్యవస్థాపకులు శ్రీశ్రీ రవిశంకర్‌ గురూజీ అన్నారు. మూడో రోజు సీఐఐ భాగస్వామ్య సదస్సులో జరిగిన ప్లీనరీ విత్‌ సోషల్‌ ఐకాన్‌ సమావేశంలో శ్రీశ్రీ రవిశంకర్‌,  ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రవిశంకర్‌ మాట్లాడుతూ ఎదగటంతో పాటు సమాజానికి కొంత ఇవ్వాలన్న దాతృత్వ గుణం ఉండాలని సూచించారు. కార్పొరేట్‌ సామాజిక బాధ్యత అని నిధిని రెట్టింపు చేయాలన్నారు. ప్రతి వ్యక్తి నైతిక విలువలతో కూడిన క్రమశిక్షణను అలమర్చుకోవాలని తెలిపారు. వ్యక్తితో పాటు సమాజంపై ఒత్తిడి తగ్గినప్పుడే సమాజం వృద్థిపథంలో దూసుకుపోతుందని అన్నారు.