ఎలక్రానిక్స్ హబ్ గా ఏపీ

ఎలక్రానిక్స్ హబ్ గా ఏపీ

26-02-2018

ఎలక్రానిక్స్ హబ్ గా ఏపీ

ఆంధ్రప్రదేశ్‌ను ఎలక్ట్రానిక్స్‌ హబ్‌గా మార్చేందుకు చర్యలు తీసుకుంటున్నామని ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్‌ అన్నారు. సిఐఐ భాగస్వామ్య సదస్సులో చివరి రోజు లోకేష్‌ మాట్లాడారు. ఎలక్ట్రానిక్స్‌ తయారీ రంగం అభివృద్ధికి పలు చర్యలు తీసుకున్నామని, అనేక పాలసీలు, రాయితీలు కల్పిస్తున్నామన్నారు. కంపెనీలు త్వరితగతిన ఏర్పాటు చేసేందుకు అనుతులు, భూమలు వేగంగా కేటాయిస్తున్నామన్నారు. రాష్ట్ర విభజన సమయంలో ఒక మొబైల ఫోన్‌ కూడా ఇక్కడ తయారు కాలేదన్నారు. ప్రస్తుతం దేశంలో తయారు అవుతున్న ప్రతి పది ఫోన్లలో 2 ఆంధ్రప్రదేశ్‌లో తయారు అవుతున్నాయన్నారు. రిలయన్స్‌ రాకతో ఈ సంఖ్య 5 కాబోతుందన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వచ్చిన వారికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. చిప్‌ డిజైన్‌, బ్యాటరీ తయారీ దగ్గర నుండి పూర్తి స్థాయి వస్తువుల తయారీ ఏపీలో జరిగేలా పూర్తి స్థాయి ఎకో సిస్టమ్‌ను అభివృద్ధి చేస్తున్నామన్నారు.