భూమాకు నివాళి అర్పించిన సీఎం చంద్రబాబు
APEDB
Ramakrishna

భూమాకు నివాళి అర్పించిన సీఎం చంద్రబాబు

13-03-2017

భూమాకు నివాళి అర్పించిన సీఎం చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కర్నాలు జిల్లా ఆళ్లగడ్డకు చేరుకొని  భూమా భౌతిక కాయానికి నివాళులర్పించారు. భూమా కుమార్తె, ఆళ్లగడ్డ ఎమ్మెల్యే అఖిలప్రియను ఓదార్చారు. కుటుంబ సభ్యులతో మాట్లాడి దైర్యం చెప్పారు.  అనంతరం చంద్రబాబు మాట్లాడుతూ పార్టీ పట్ల భూమా ఎంతో విధేయతగా ఉండేవారని అన్నారు. ఓ కుటుంబ సభ్యుణ్ని తెలుగుదేశం పార్టీ పోగొట్టుకుందని, ఆయన మృతి పార్టీకి తీరని లోలు అని అన్నారు. నంద్యాల అభివృద్ధికి భూమా ఆహర్నిశలూ కృషి చేశారని కొనియాడారు. భూమా ఏ ఆశయాల కోసం పనిచేశారో వాటిని అఖిలప్రియ కొనసాగించాలన్నారు. ఏ రోజూ పదవులు కోరలేదని, నంద్యాల, అళ్లగడ్డలను  అభివృద్ధి చేయాలని మాత్రమే కోరేవారని అన్నారు. వూహించని ఈ ఘటన తననెంతగానో బాధించిందన్నారు.