ఆంధ్రప్రదేశ్ కు ఎమిరేట్స్

ఆంధ్రప్రదేశ్ కు ఎమిరేట్స్

09-02-2018

ఆంధ్రప్రదేశ్ కు ఎమిరేట్స్

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో విమానయాన రంగ అభివృద్ధికి తోడ్పడేందుకు ఎమిరేట్స్‌ గ్రూప్‌ అంగీకరించింది. ఇందులో భాగంగా ఇందుకు అవసరమైన మౌలిక వసతుల అభివృద్ధిలో రాష్ట్ర ప్రభుత్వంతో సహకరిస్తుంది. ఇందుకు సంబంధించిన అవగాహన ఒప్పందం (ఎంఒయు)పై ఎమిరేట్స్‌ ఎయిర్‌లైన్‌ అండ్‌ గ్రూప్‌ చైర్మన్‌, సిఇఒ షేక్‌ అహ్మద్‌ బిన్‌ సయీద్‌ అల్‌ ముక్తౌం, ఎపీ ఆర్థిక అభివృద్ధి బోర్డు (ఎపిఇడిబి) సిఇఒ కృష్ణ కిశోర్‌ సంతకాలు చేశారు. రాష్ట్రంలో విమానయాన రంగ అభివృద్ధికి అవసరమైన నైపుణ్యాలు, పెట్టుబడుల విషయంలోనూ ఎమిరేట్స్‌ గ్రూప్‌ సహకారం అందిస్తుంది. రాష్ట్రంలో వైమానిక, విమానయాన రంగాలను అభివృద్ధి చేయాలనే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యాన్ని ఈ ఒప్పందం మరింత చేయూత ఇస్తుందని ఏపిఇడిబి సిఇఒ చెప్పారు. ఈ ఒప్పందం ప్రకారం ఆంధ్రప్రదేశ్‌లో విమానాశ్రయాలు, అందుకు అవసరమైన నైపుణ్యాల అభివృద్ధి విషయంలో ఎమిరేట్స్‌ గ్రూప్‌ సహకరిస్తుంది.