ఆ అధికారం ఎవరిచ్చారు... నోరు అదుపులో పెట్టుకో

ఆ అధికారం ఎవరిచ్చారు... నోరు అదుపులో పెట్టుకో

08-02-2018

ఆ అధికారం ఎవరిచ్చారు... నోరు అదుపులో పెట్టుకో

బీజేపీ నేత సోము వీర్రాజుకు ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షా చీవాట్లు పెట్టినట్టు బీజేపీ వర్గాలు చెబతున్నాయి. ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై విమర్శలు చేసే అధికారం నీకు ఎవరిచ్చారని, నోరు అదుపులో పెట్టుకోవాలని అమిత్‌ షా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. మరోసారి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే తీవ్ర చర్యలుంటాయని అమిత్‌ షా హెచ్చరించినట్లు బీజేపీ వర్గాలు తెలిపాయి. చంద్రబాబుపై వ్యాఖ్యలకు వివరణ ఇవ్వాలని అమిత్‌ షా ఆదేశించినట్లు తెలుస్తోంది. సోమువీర్రాజుకు అమిత్‌షా వార్నింగ్‌ ఇవ్వడం ఇప్పుడు బీజేపీలో చర్చనీయాంశమైంది.